వంగవీటి రాధా. విజయవాడ సహా.. ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గాన్నిఏకతాటిపైకి తీసుకువచ్చి.. తనకు అనుకూలంగానే కాదు.. సమాజానికి కూడా అనుకూలంగా మార్చిన వంగవీటి రంగా వారసుడి గా.. రాజకీయ అరంగేట్రం చేసి.. 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రాజకీయంగా అడుగులు వేసిన రాధా.. రంగా వారసుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయన తండ్రి పేరును నిలబెడతారంటూ.. ఆ నాడు.. ఎంతో మంది పోటీలో ఉన్నా.. అందరినీ కాదని.. వైఎస్ రాజశేఖరరెడ్డి.. కోరి కోరి రాధాకు టికెట్ ఇచ్చారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాధా.. ఆ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అంతే! ఆ తర్వాత.. ఇప్పటి వరకు ఆయనకు విజయం అన్న మాట వినిపించడమే మానేసింది. ఈ 20 ఏళ్లలో రాధా సాధించింది ఏమైనా ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. నిజానికి రంగా రాజకీయ జీవితం చూసుకుంటే.. 19-20 సంవత్సరాల లోపే ఉంటుంది. 1947లో జన్మించిన రంగా.. 1988లో మృతి చెందారు. అంటే.. ఆయన జీవించిందే 41 ఏళ్లు. ఈ రకంగా చూసుకుంటే.. రంగా రాజకీయ జీవితం స్వల్పం.
అయితే.. ఎంతకాలం ఉన్నామన్నది కాదు.. ఎంత మెరుగ్గా ఉన్నమన్నదే లెక్క అని అన్నట్టు ఉన్నది స్వల్ప కాలమే అయినా.. ఆయన పేరు ఇప్పటికీ చిరస్థాయి. మరో 100 సంవత్సరాల వరకు రంగా పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ.. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధాకు రాజకీయంగా 20 ఏళ్లు పూర్తయ్యాయి. మరి ఎంత మెరుగ్గా ఉండి ఉండాలి? ఎన్ని పదవులు చేసి ఉండాలి? కానీ, అలాంటిది ఏమీ కనిపించడం లేదు. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారన్న రికార్డు మినహా.. రాధాకు మిగిలింది ఏమీ లేకుండా పోయింది.
సామాజిక వర్గాన్ని ఆకట్టుకోలేక పోవడం.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయకపోవడం.. బలమైన ఉద్యమ నిర్మాతగా తనను తాను మలుచుకోలేక పోవడం.. ఒకప్పుడు రంగాకు వెన్నుదన్నుగా ఉన్న కార్మిక సంఘాలకు రాధా దూరంగా కావడం.. వంటివి రాధాను మాస్ నాయకుడిగా నిలబెట్టలేక పోయాయి. రాధా అంటే.. క్లాస్ నాయకుడిగానే చూసే పరిస్థితిని ఆయనే తెచ్చుకున్నారు. దీనికితోడు రాజకీయంగా వేసిన అడుగులు కూడా మైనస్ అయ్యాయి. పెరిగిపోయిన జంపింగులు.. ఆయనను మరింత జావగార్చాయి. ఫలితంగా.. రాధా పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. మరి ఇప్పటికైనా ఆయన రూటు మార్చుకుంటారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on September 16, 2024 6:57 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…