వైసీపీ అధినేత జగన్.. వారానికి ఒక సారి బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. వీకెండ్ అక్కడే గడిపేసి వచ్చి.. రెండు రోజులు చంద్రబాబుపై ఏవో నాలుగు మాటలు అనేసి వెళ్లిపోతున్నారు. మళ్లీ వీకెండ్ బెంగళూరు టూరే. ఇదీ.. గత మూడు మాసాల నుంచి జరుగుతున్న పని. అయితే.. ఆయన చెబుతున్నది ఏంటంటే.. పార్టీ నాయకులు ప్రజల మధ్య ఉండాలని! నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని!!
ఈ విషయంపైనే అధికారికంగా.. నేతలందరికీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన.. గెలిచిన నాయకులకు కూడా జగన్ నుంచి సందేశాలు అందాయి. “తక్షణం ప్రజల మధ్యకు వెళ్లండి. మీకు నచ్చిన రీతిలో ప్రజల సమస్యలను ప్రస్తావించండి. ప్రజలకు అండగా ఉండండి” అని జగన్ ఇచ్చిన సందేశంలో కీలక అంశం. అయితే.. దీనిని ఎంత మంది పాటిస్తున్నారు? అంటే.. జీరో! ఎందుకంటే.. పార్టీ అధినేతే.. సవ్యంగా ప్రజల మధ్య ఉండనప్పుడు.. ఆ మాటకొస్తే.. నాయకులకే ఆయన అందుబాటులో ఉండడం లేదు.
దీంతో నాయకులు కూడా ఎవరికి వారు ఎవరికి తోచిన విధంగా వారు ఉంటున్నారు. చాలా మంది నాయకులు.. తమ తమ వ్యాపారాలు దెబ్బతినకుండా చూసుకుంటున్నారు. “ఎన్నికల్లో మా నాయకుడు చాలానే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు నష్టాలు రాకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చే ఆలోచన అయితే.. లేదు” అని సీమకు చెందిన ఇంకా చెప్పాలంటే.. జగన్ సొంత జిల్లా కడపకు చెందిన ఓ మైనారిటీ నాయకుడి అనుచరుడు చెప్పాడు.
ఈ ఒక్కరే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఇక, జగన్ వీర భక్త నాయకులుగా గుర్తింపు పొందిన రోజా, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్, పాముల పుష్ప శ్రీవాణి, కారుమూరి నాగేశ్వరరావు వంటివారు కూడా.. బయటకు రావడం లేదు. మరికొందరు గడుసుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. “ఆయన కు పాస్ పోర్టు వచ్చి ఉంటే ఇప్పుడు లండన్‌లో ఉండేవారు. ఆయన లేకుండా మేం ఏం చేస్తాం.” అని విజయవాడకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు వ్యాఖ్యానించారు. సో.. జగనే ప్రజలను పట్టించుకోకుండా.. బెంగళూరు-తాడేపల్లి చుట్టూ తిరుగుతుంటే.. నాయకులు మాత్రం ప్రజల్లో తిరుగుతారా? అనేది ఇక్కడ కీలక పాయింట్.
This post was last modified on September 16, 2024 6:45 am
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…