కొన్ని వారాల ముందు మంచి జోష్‌లో ఉన్నాడు దర్శకుడు హరీష్ శంకర్. తన కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ సూపర్ హిట్ కాబోతోందన్న ధీమాతో ఆయనున్నాడు.
‘దబంగ్’ను ‘గబ్బర్ సింగ్’గా.. ‘జిగర్ తండ’ను ‘గద్దలకొండ గణేష్’గా ఆయన తనదైన శైలిలో రీమేక్ చేసి మంచి ఫలితాన్నందుకున్న నేపథ్యంలో ‘రైడ్’ రీమేక్ ‘మిస్టర్ బచ్చన్’ కూడా వాటి కోవకే చెందుతుందని అభిమానులు కూడా ఆశించారు.
కానీ ఫలితం వేరుగా వచ్చింది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ మూవీ. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ రావడంతో హరీష్ శంకర్‌కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కనుందని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ హోల్డ్‌లో పెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తిరిగి పట్టాలెక్కే లోపు చిరుతో హరీష్ సినిమా లాగించేస్తాడని వార్తలొచ్చాయి.
కానీ కట్ చేస్తే.. ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ అయ్యాక ఆ ఊహాగానాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. హరీష్ ఇప్పుడు వేరే సినిమా చేసే సంకేతాలేమీ కనిపించడం లేదు.
ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీదే తిరిగి హరీష్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’ తేడా కొట్టిన నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద పవన్ అభిమానులకు సందేహాలు నెలకొన్నాయి. హరీష్‌కు కూడా ఒకసారి స్క్రిప్టు సరి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
వేరే కమిట్మెంట్ ఏదీ లేకపోవడంతో పవన్ అందుబాటులోకి వచ్చేలోపు స్క్రిప్టును మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుకోవాలని భావించి.. తన రైటింగ్ టీంతో కలిసి హరీష్ శంకర్ మార్పులు చేర్పులు చేపట్టినట్లు సమాచారం. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడంతో పాటు పవన్ వీలును బట్టి వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయడానికి ప్లానింగ్ కూడా జరుగుతున్నట్లు తెలిసింది
This post was last modified on September 8, 2024 10:08 am
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…