టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఈవో అవతారం ఎత్తారు. తానుపనిచేస్తూ.. తన వారితో పనిచేయిస్తూ.. ప్రజలను ఆదుకుంటున్నారు. సాధారణంగా యజమాని అయితే.. చెప్పి చేయించుకుంటారు. కానీ, సీఈవో మాత్రం తాను చేస్తూనే.. తన వారితో చేయిస్తారు. ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు యజమాని పొజిషన్‌లోనే ఉన్నా.. ఆయన ఆ విషయాన్ని ఆదివారమే మరిచిపోయారు. వయసుతో సంబంధం లేకుండా.. అనారోగ్య సమస్యలతోనూ సంబంధం లేకుండా తానే రంగంలోకి దిగిపోయారు.
నడుములోతు నీటిలోనూ చంద్రబాబు తిరుగుతున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో తన సెక్యూరిటీని కూడా ఆయన మరిచిపోతున్నారు. రైలు పట్టాలు ఎక్కేస్తున్నారు. కాలువల్లో తిరిగేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది బాధితులను ఆదుకోవడం ఒక్కటే. ఇంతకు మించి ఆయన తన హోదా.. వయసు, ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన తిరగడమే కాదు.. తన మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దించుతున్నారు.
వారితోనూ అలుపెరుగకుండా పనులు చేయిస్తున్నారు. రాత్రిళ్లు వంటలు చేయించడం.. ఉదయాన్నే సూర్యోదయం నాటికే వాటిని పొట్లాలు కట్టి బాధితులకు అందిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి సాయం చేస్తున్నవారిని కలుస్తున్నారు. ఇంకా చేయాలనిప్రోత్సహిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చేవారిని సమన్వయం చేసుకుంటున్నారు. ఇక్కడి కష్టాలు వివరిస్తున్నారు. బాధితులను సాధ్యమైనంత ఎక్కువగా ఆదుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంకోవైపు.. పార్టీలో ఏర్పడుతున్న ఇబ్బందులను అప్పటికప్పుడే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నా రు. ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నారు. ఇలా.. చంద్రబాబు రెండు చేతులతో ఒక మెదడుతో కాదు.. పదహారు చేతులతో పనిచేసతూ.. పది మెదళ్లతో ఆలోచిస్తూ.. బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఐదు రోజులు అయినా.. బాధిత ప్రాంతాల్లో ఇంకా మెరుగు పడిన పరిస్థితి కనిపించకపోవడంపై మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. చంద్రబాబు సీఈవోగా మారిపోవడం గమనార్హం.
This post was last modified on September 6, 2024 2:04 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…