ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. షెడ్యూల్ ప్రకారం గురువారం లండన్‌కు వెళ్లాల్సి ఉంది. ఆయన ఇద్దరు కుమార్తెలు.. బ్రిటన్‌లో చదువుతున్న విషయం తెలిసిందే. వీరిలోపెద్ద కుమార్తె పుట్టిన రోజు ఈ నెలలోనే ఉంది. దీంతో ఆయన కుమార్తెలను చూసేందుకు బ్రిటన్‌కు వెళ్లాల్సి ఉందని.. నెల రోజుల కిందటే హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకు న్నారు. మొదట అనుమతి ఇవ్వద్దొని సీబీఐ తరఫున న్యాయ వాదులు కోర్టును కోరినా.. గతంలో బెయిల్ నిబంధనలు ఉన్నా.. ఆయన బ్రిటన్ సహా స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లి వచ్చారని పేర్కొన్న కోర్టు.. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
దీంతో తాజా పర్యటనకు 20 రోజుల కిందటే కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే.. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని, ఒక దేశానికి అని చెప్పి.. వేరేదేశం వెళ్లరాదని ఆంక్షలు విధించింది. ఇదేసమయంలో ఫోన్ నెంబర్లు, పాస్ పోర్టు వివరాలను కూడా పోలీసులకు చెప్పాలని.. బ్రిటన్‌లో ఎక్కడ ఉంటున్నదీ ఎక్కడెక్కడ పర్యటించేది కూడా వెల్లడించాలని పేర్కొంది. మొత్తానికి జగన్‌కు, ఆయన సతీమణికి కూడా విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు వారు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బ్రిటన్‌కు వెళ్లాలి. అయితే.. ఇంతలోనే ఏపీలో పరిస్థితి మారిపోయిం ది. కృష్ణానదికి పోటెత్తిన వరదలు, బుడమేరు పొంగడంతో పలు జిల్లాలు నీటి లో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు వరద నీటిలో జలదిగ్బంధమయ్యారు. గత నాలుగు రోజులుగా వారికి ఆహారం కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో వారిని వదిలేసి.. జగన్ బాధ్యత లేకుండా విదేశాలకు వెళ్లిపోతారా? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలావుంటే.. మరోవైపు గోదావరికి కూడా.. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రమాదకర రీతిలో గోదావరి ప్రవహిస్తోంది.
దీంతో ఏ క్షణమైనా తూర్పు గోదావరికి కూడా.. ప్రమాదం పొంచి ఉందనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు.. ప్రభుత్వ పక్షాలకు దీటుగా ప్రతిపక్షంగా జగన్ కూడా స్పందించాల్సి ఉంది. కానీ, ఆయన పరిస్థితి చూస్తే.. గత నాలుగు రోజుల్లో కేవలం రెండు సార్లు మాత్రమే విజయవాడలో పర్యటించారు. ఒకసారి కృష్ణ లంక, రెండోసారి బుధవారం రాజరాజేశ్వరి పేటలో పర్యటించారు. ఇంతకు మించి ఎలాంటి సాయం చేయలేదు. కానీ, ప్రజలు మాత్రం ప్రతిపక్షం కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో జగన్ విదేశాలకు వెళ్తే.. ఆయనకు మరింత బ్యాడ్‌నేమ్ వస్తుందని పార్టీ వర్గాలే చెబుతుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చేయాలి.
This post was last modified on September 5, 2024 11:12 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…