వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉంటున్నారు. భూకంపం వచ్చినా స్థితప్రజ్ఞతనే ప్రదర్శిస్తున్నారు. ఎక్క డా నోరు విప్పడం లేదు. రచ్చచేయడం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.
మరింత మంది ఈ బాటలో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. జగన్ ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. వెళ్లిపోయిన వారికి అది చేశాను.. ఇది చేశాను..అ ని కామెంట్లు చేయలేదు. ఎక్కడా తొందర పడడం కూడా లేదు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితి వేరే పార్టీల్లో ఉంటే.. వెంటనే సంబంధిత పార్టీ అధినేత లిఖిత పూర్వకం గానో.. మీడియా ముఖంగానో బయటకు వచ్చి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ, జగన్ విషయంలో మాత్రం ఇలాంటి ఆందోళన కనిపించడం లేదు.
దీనికి కారణం ఏంటి. ఎందుకు ఆయన అంత మౌనంగా ఉన్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఆది నుంచి జగన్‌లో ఇలాంటి వ్యవహార శైలే ఉంది. అనేక మంది నాయకులు వెళ్లిపోయినా.. ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశే ఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటివారు.. తనకు వ్యతిరేకంగా ఓటేస్తారని తెలిసి కూడా.. జగన్ భయ పడలేదు.
అత్యంత కీలకమైన ఆ సమయంలోనూ.. మొండిగానే వ్యవహరించా రు. మీకు టికెట్లు ఇవ్వనని.. మీ ఇష్టమైనట్టే వ్యవహరించండని ఆయన తేల్చి చెప్పారు. ఫలితంగా పంచుమర్తి అనురాధ టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు.
ఇక, సాధారణ ఎన్నికలకు ముందు కూడా అనేక మంది నాయకులకు టికెట్లు ఇవ్వడలేదు. దీంతో వారం తా కూడా.. జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బాట పట్టారు. అప్పుడు కూడా జగన్ ఆలోచన చేయలే దు. సో… కీలకమైన ఎన్నికల సమయంలోనే జగన్ స్పందించనప్పుడు.. ఇప్పుడు స్పందిస్తారని అనుకోవ డం పొరపాటే. పైగా మళ్లీ ఎన్నికలకు ఐదేళ్ల సమయం ఉంది.
కాబట్టి.. ఏం జరిగినా.. ఫర్వాలేదన్న విధంగానే జగన్ ఉండడం గమనార్హం. తన పార్టీలో తనను మెచ్చిన నాయకులే ఉంటారని ఆయన తలపోస్తున్నారు తప్ప.. పార్టీ విధానాలను మార్చుకోవాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు.
This post was last modified on September 4, 2024 11:11 am
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…
క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…
క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…