Political News

10 నుంచి ప్ర‌జ‌ల్లోకి కేసీఆర్‌!

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ఈ నెల 10వ తేదీ నుంచి ప్ర‌జ‌ల్లోకి రానున్నారు. వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం ముగిసిన త‌ర్వాత ఆయ‌న ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుసుకునేందుకు.. ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను కేసీఆర్ ఎండ‌గ‌డ‌తార‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉద్య‌మానికి రెడీ అవుతార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు తెలిపారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్ర‌జ‌ల నుంచి నిరంత‌రం.. లేఖ‌లు, ఫోన్లు, సందేశాల రూపంలో కేసీఆర్‌కు అనేక విన్న‌పాలు వ‌స్తున్నాయని బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీటిలో ప్ర‌స్తుత రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పైనే ఎక్కువ‌గా ఫిర్యాదులు వ‌స్తున్న‌ట్టు తెలిపారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం మానేసిన‌.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం.. ఈ విష‌యాన్ని దారి మ‌ళ్లించేందుకు.. రాజ‌కీయ నేత‌ల నోరు నొక్కేందుకు హైడ్రా సంస్థ‌ను తీసుకువ‌చ్చింద‌నేది కేసీఆర్ అభిప్రాయంగా చెబుతున్నారు.

కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న నిర్మాణాలు.. రేవంత్‌రెడ్డికి ఇప్పుడే గుర్తుకు వ‌చ్చాయా? అనేది కేసీఆర్ ప్ర‌శ్న‌గా ఉంద‌న్నారు. దీనికితోడు రైతు రుణ మాఫీలోనూ అక్ర‌మాలు చోటు చేసుకున్న‌ట్టు ఫిర్యాదులు అందాయని.. ఇక‌, ఇత‌ర ప‌థ‌కాల అమ‌లుపై కూడా ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. అందుకే వారి త‌ర‌ఫున పోరాటం చేసేందుకు కేసీఆర్‌.. ఈ నెల 10 త‌ర్వాత‌.. నేరుగా ప్ర‌జాక్షేత్రంలోకి దిగ‌నున్న‌ట్టు బీఆర్ఎస్ వ‌ర్గాలు వివ‌రించాయి. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయ‌ని తెలిపాయి.

ఆరు గ్యారంటీల అమలు, అదుపుతప్పిన పాలనపై ‘సమరశంఖం’ పేరుతో ఉద్య‌మాన్ని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి. కాగా, అనారోగ్య కార‌ణాల‌తో కేసీఆర్‌.. గ‌త కొన్నాళ్లుగా ఇంటికే ప‌రిమితం అయ్యారు. అసెంబ్లీ బ‌డ్జెట్‌ స‌మావేశాల‌కు కూడా.. ఒక్క‌రోజు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచివ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌జాక్షేత్రంలోకి రావాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on August 31, 2024 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

3 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

3 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

4 hours ago

నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ – భవిష్యత్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…

5 hours ago

భగ‌వ‌త్ గారి గీతోప‌దేశం.. మోడీకి మండేలా ఉందే!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్‌.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాల‌కు కూడా.. ఐకాన్‌. ఆయ‌న…

5 hours ago