ఒకవైపు హైడ్రాపై చర్చలు జరుగుతున్న సమయంలో.. ఆ సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పొద్దు పొద్దున్నే వాలిపోతోంది. రాత్రి నిద్ర పోయిన వారుతెల్లవారి కళ్లు తెరిచేలోగానే హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తోంది. నిజానికి ఈ కూల్చివేతల సమయంలో అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. న్యాయ స్థానం మెట్లు ఎక్కేందుకు చూస్తున్నారు. కానీ.. కోర్టుల్లో పిటిషన్ వేసే లోగానే హైడ్రా పని చేసేస్తోంది. దీంతో వారికి ఊరట లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
అక్కినేని నాగార్జున ఎన్
కన్వెన్షన్ విషయంలోనూ ఇదే జరిగింది. తెల్లవారు జామున 5 గంటలకే రంగం లోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ను నేల మట్టం చేసింది. ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసే సరికే.. పావు వంతు కూల్చివేతలు అయిపోయాయి. ఇక, నాగార్జున మేల్కొని హైకోర్టుకు వెళ్లి.. స్టే తెచ్చుకు నే సరికి కాగల కార్యాన్ని హైడ్రా పూర్తి చేసేసింది. నాలాలు, చెరువులు, సరస్సులు(లేక్స్) ఆక్రమించుకుని కట్టుకున్నవారికి తగిన శాస్తి జరిగిందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కానీ, ఇదే సమయంలో గత అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే తాము నిర్మించామని.. తప్పు తమది కాదని వాదించేవారు.. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఇంత దూకుడు అవసరమా? అని వాపోతున్నారు. పైగా న్యాయ పోరాటానికి కూడా సమయం ఇవ్వకుండా చేయడాన్ని నిరసిస్తున్నారు. ఇక, తాజాగా హైడ్రా అధికారులు సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న రాంనగర్ పై పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని అడిక్‌మెట్‌లో నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ.. వాటిని శుక్రవారం తెల్లవారు జాము నుంచే కూల్చివేయడం ప్రారంభించారు.
వాస్తవానికి ఈ నిర్మాణాలను రెండు రోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసి వెళ్లారు. దీనిపై నివేదిక తెప్పించుకున్నారు. అయితే.. ఈ పరిణామాలతో సదరు నిర్మాణాల యజమానులు.. నోటీసులు ఇస్తారు లే.. అప్పుడు చూసుకుందాం.. అని భావించారు. కానీ.. ఉరుములు లేని వర్షంలా.. హైడ్రా శుక్రవారమే విరుచుకుపడింది. ఉదయం ఈ వార్త బయటకు వచ్చే సరికే.. నిర్మాణాల కూల్చి వేతలు పూర్తయ్యాయి. అయితే.. ఈ వ్యవహారంపైనా మిశ్రమ స్పందన వస్తుండడం గమనార్హం. తమకు అవకాశం ఇవ్వకుండానే ఇలా చేయడం ఏంటని యజమానులు చెబుతున్నారు.
This post was last modified on August 30, 2024 10:30 am
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…