వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మందిలో నలుగురు నుంచి ఐదుగురు వరకు పార్టీలు మారతారని.. కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. అయితే.. అనుకున్నట్టుగా కాకుండా.. ఊహించని విధంగా కొందరు పార్టీ మారుతుండడం ఇప్పుడు చర్చకు వస్తోంది. వీరిలోనూ బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ,గొల్ల బాబూరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి వీరిలో బీద మస్తాన్‌రావు, మోపిదేవి కన్ఫర్మ్ చేశారు. గొల్ల బాబూరావు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.
అయితే.. మోసిదేవితో పాటు.. గొల్ల బాబూరావు కూడా.. ఢిల్లీకి వెళ్తారని.. తన రాజీనామా పత్రం సమర్పిస్తార ని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వీరు ఏ పార్టీలోకిజంప్ చేస్తారనే విషయం చూస్తే.. మోపిదేవి ఇప్పటికే.. టీడీపీకి జైకొట్టారు. ఇక, బీద ఎలానూ టీడీపీకి పాతకాపే కాబట్టి.. ఇటు వస్తారు. ఇక, గొల్ల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానేఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. వీరి వ్యవహార శైలి ఏంటో.. కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అధిష్టానం ఎంత ప్రేమగా చూసినా.. వారు అక్కడ ఉండలేదు.
మరి ఇలాంటివారిని తీసుకుని చంద్రబాబు సాధించేది ఏంటి? మోపిదేవిని జగన్ చూసుకున్నట్టుగా ఇంకెవరూ చూడలేదు. మంత్రి పదవి ఇచ్చారు. ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. తర్వాత.. రాజ్యసభకు పంపించారు. కేబినెట్ హోదా కల్పించారు. అయినా.. ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు. ఇక, బీద కూడా.. టీడీపీ నుంచి వచ్చాక 2019లో ఆయనకు కూడా రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు. వ్యాపారాలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.
గొల్ల బాబూరావు అయితే.. మరీ విడ్డూరం. ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు తెచ్చుకుని తృటిలో బతికిపోయారు. లేకపోయి ఉంటే.. ఆయన కూడా పాయకరావు పేట నుంచి పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారు. ఇంత చేసినా..జగన్‌పై వారికి ఏమాత్రం అభిమానం లేదు. మరి ఇలాంటి నాయకులను తీసుకుంటే..చంద్రబాబు అవమానం కాదా? రేపు అవసరం తీరాక..చంద్రబాబును మాత్రం వారు ఉపేక్షిస్తారా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయకపోతే.. చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 29, 2024 3:12 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…