వైసీపీకి కష్టాలు మరింత పెరిగాయి. ఎన్నికల్లో ఎదురైన ఘరో పరాజయం దరిమిలా.. ఆ పార్టీని కాపాడుకు నే ప్రయత్నంలో జగన్ దూకుడు చూపించకపోవడంతోపాటు.. అసలు పార్టీలో ఇప్పటికీ ఒక విధమైన గ్యా ప్‌ను మెయింటెన్ చేయడం వంటివి నాయకులకు రుచించడం లేదు. ఈ క్రమంలోనే కీలక నాయకులు సైలెంట్‌గా వెళ్లిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కేవలం రెండు మాసాల్లోనే వైసీపీలో భారీ వికెట్లు పడుతున్నాయి. సౌమ్యులు అన్న నాయకులు కూడా వెళ్లిపోతున్నారు.
ప్రస్తుతం జగన్ హవా పెరగకపోగా.. ఆయన తాడేపల్లి నుంచి బయటకు రావడమే మానేశారు. పోనీ.. అక్క డకు వెళ్లి కలవాలన్నా.. కూడా నాయకులకు దర్శనం లభించడం లేదు. అప్పాయింట్‌మెంటు ఇవ్వడం లేదు. పైగా.. మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారినే కలవాలంటూ.. సూచనలు రావడంతో నాయకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక, ఎన్నాళ్లయినా.. పార్టీలోఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్న నాయకులు జంప్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
“మేమైనా మారాలి.. ఆయనైనా మారాలి.. ఏదో ఒకటి జరిగితేనే బాగుంటుంది“ అని ఇటీవల ఏలూరులో కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన మనసులో ఆవేదన అందరికీ తెలిసిందే. కానీ, ఆయన సౌమ్యుడు కావడంతో కొంత సంయమనం పాటించారు. ఇక, పార్టీలో ఇక, పుంజుకునే అవకాశం లేదని.. భావిస్తున్న వారు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. నిజానికి ఓడిపోయిన పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోవడం సమంజసమే. కానీ, వైసీపీ లెక్క వేరు.
నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ.. అంటూ నాయకులతోనూ జగన్ బాండింగ్ పెంచుకున్నారు. అలాంటి జాబితా లో ఉన్న నాయకులు కూడా.. జంప్ చేస్తున్నారు. ఇదీ.. అసలు అలజడి. నిజానికి ఇలాంటి ఈక్వేషన్‌తో జగన్.. రెడ్డి సామాజిక వర్గానికి కూడా టికెట్లు ఇవ్వలేదు. సో.. అటు రెడ్లు ఎన్నికల సమయంలో హ్యాండిచ్చారు. ఇప్పుడు బీసీ నాయకులు ఎన్నికల తర్వాత.. హ్యాండిస్తున్నారన్న మాట. మొత్తానికి వైసీపీ నిలబడడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…