రాజకీయ పార్టీలకు వ్యూహకర్తల అవసరం చాలానే ఉంది. ఇలానే వైసీపీ అధినేత జగన్ కూడా ఐప్యాక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. తాజా ఎన్నికల్లో `ఐ ప్యాక్` విఫలమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరో రాజకీయ వహకర్త కోసం చేస్తున్నారు. కానీ, ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదు. ప్రస్తుతం ఆయన బలమైన వ్యూహకర్త కోసం అన్వేషిస్తూనే ఉన్నారు నిజానికి ఐ ప్యాక్ 2019 ఎన్నికల్లో ఆయనకు బలమైన సంఖ్యలో అభ్యర్థులను అందించింది.
అంతేకాదు.. బలమైన ప్రభుత్వాన్ని అందించడంలో కూడా ఐప్యాక్ ఎంతగానో దోహదపడింది. కానీ అప్పటి `ఐ పాక్`లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బలమైన పాత్ర పోషించారు. ఆయన కారణంగానే వైసీపీకి బలమైన పునాదులు పడ్డాయి. అయితే.. తర్వాత కాలంలో ఆయన సొంత పార్టీ పెట్టుకొని బీహార్లో వచ్చే ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. దీంతో ఐపాక్‌లో అప్పటివరకు ఉన్న ప్రశాంత్ కిషోర్ ముద్ర పూర్తిగా చిరిగిపోయింది.
తర్వాత అయినా బాగానే పనిచేస్తుందని జగన్ భావించించారు. కానీ, అనుకున్నంత స్థాయిలో టీం పని చేయలేకపోయింది ఫలితంగా తాజా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరాతి ఘోరంగా ఓటమి పాలయ్యారు 151 సీట్ల నుంచి 11స్థానాలకు దిగిపోయారు. దీని వెనుక వ్యూహకర్త.. కిషోర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాల క్రమంలోనే కాంగ్రెస్‌కు వ్యూహ కర్తగా పనిచేస్తున్న సునీల్ కొనుగోలు కోసం జగన్ కొన్నాళ్ల కింద నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఆయనను వదులుకునే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే కొన్ని నాలులోనే మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు పాత్ర కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంది. దీంతో ఆయనను వదులుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ఎవరూ రెడీగా లేపొవడం గమనార్హం. జగన్‌కు ప్రశాంత్ కిషోర్ తలదన్నేటటువంటి నాయకుడు అవసరంగా మారినా.. ఆ మేరకు ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయ వ్యూహకర్త అత్యవసరంగా లభించడం కష్టంగానే ఉంది. మరి ఈ స్థాయిలో రాజకీయాలు చేయగలిగిన వ్యూహకర్త ఎవరున్నారు? ఎప్పుడొస్తారు? అనేది వేచి చూడాల్సిందే.
This post was last modified on August 28, 2024 2:25 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…