బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే.. దీనిని తమ విజయంగా బీఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. `న్యాయం` గెలిచిందని మాజీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ కామెంట్ చేశారు. దీనిలో తప్పులేకున్నా.. వాస్తవానికి కవిత నిజంగానే గెలిచిందా? కేసును ఓడించిందా? అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి పెద్దగా లోతుపాతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే.. కేసు తీవ్రత.. అర్థమవుతుంది.
కవితకు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. కేసును ఎక్కడా తప్పుబట్టలేదు. అయితే.. దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరులో ఉన్న లోపాలను మాత్రం ఎండగట్టింది. ఇది సర్వసాధారణంగా జరిగేదే. గతంలో ప్రొఫెసర్ సాయిబాబా విషయంలోనూ ముంబై కోర్టు ఇలానే వ్యాఖ్యానించింది. మావోయిస్టులతో చేతులుకలిపి.. ప్రధాని మోడీని అంతమొందించేందుకు మేధోపరిజ్ఞానం పంచుకున్నారన్న ఆరోపణలతో సాయిబాబాను ఎన్ఐఏ అరెస్టు చేసి.. 2018 నుంచి జైల్లోనే ఉంచింది. దీనిలోనూ కేసు తేలలేదు. దీంతో ఆయన పాత్రపై సందేహాలు వ్యక్తం చేసిన కోర్టు.. నిర్దోషిగా వెల్లడించింది. అయితే.. కేసు తేలితే.. మాత్రం ఆయనను వదిలిపెట్టలేమని తేల్చి చెప్పింది.
ఇక, కవిత విషయం వేరు. ఆమెపై సాక్ష్యాలు ఉన్నాయని.. కేసులో బలమైన.. ఆరోపణలు కూడా ఉన్నాయని.. సీబీఐ, ఈడీలు బలమైన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాయి. దీంతో కేసు జోలికి పోవడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం .. బెయిల్ ఇవ్వచ్చా.. ఇవ్వకూడదా? అన్న రెండు అంశాలపైనే దృష్టి పెడతామని చెప్పింది. ఈ క్రమంలోనే సీబీఐ ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేయడం.. ఈడీ విచారణలు కూడా పూర్తి అయిన నేపథ్యంలోనే బెయిల్ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసింది తప్ప.. కవితకు ఎక్కడా ఈ కేసుతో సంబంధం లేదని సర్టిఫికెట్ ఇవ్వలేదు.
రేపు చార్జిషీట్లపై విచారణ ప్రారంభించిన తర్వాత… కవిత ఇరుకున పడే అవకాశం ఉంది. అయితే.. దీనికి కొంత సమయం పడుతుందే తప్ప.. పూర్తిస్తాయిలో ఊరట అయితే.. ఆమెకు లభించలేదు. అనేక మంది సాక్షులు.. రేపు కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు వారు చెప్పే వాంగ్మూలాల ఆధారంగా కవితపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఒక్క కవితే కాదు.. మద్యం కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరిపైనా ఇదే కత్తి వేలాడుతోంది. సో.. ఇప్పటికిప్పుడు తగ్గింది.. ఊరటే తప్ప.. న్యాయం కాదు. ఈ కేసు ఇంకా కొనసాగుతుంది.
This post was last modified on August 28, 2024 12:21 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…