తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకింత ఆగ్రహంతో ఉంది. ఆయన మాటను కూడా ఎవరూ పెద్ద పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇదే విషయాన్ని రేవంత్ కొన్ని రోజుల కిందట చెప్పుకొచ్చారు. మా మాట వినడం లేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిరంజీవి జోక్యం చేసుకుని.. సీఎం చెప్పింది.. నిర్మాతలు ఆలోచించాలని సూచించారు. ఆ సమయంలో కొంత వరకు సానుకూల పవనాలు వచ్చాయి. మరి రేవంత్ ఏం కోరుకున్నారో తెలియదు కానీ.. నిర్మాతలు మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు.
ఇక, ఇప్పుడు అనూహ్యంగా కాకపోయినా.. ముందస్తుగానే నోటీసులు ఇచ్చి..అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేశారు. శనివారం ఉదయం 6 గంటలకే మొదలైన కూల్చివేతలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ పరిణామం హైదరాబాద్ సహా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు వచ్చాయి. పైగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే.. అందరూ అవాక్కయ్యారు. మరికొందరు హర్టయ్యారు. ఒక్క నాగార్జునే కాదు.. చాలా మంది నిర్మాతలు కూడా.. అనేక ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలే చేపట్టారు.
ఇప్పుడు వాటికి కూడా నోటీసులు ఇవ్వడం తప్పదు. ఒకరిది కూల్చి.. మరొకరికి ఎక్సెప్ఫన్ ఇవ్వరు. దీంతో సినిమా ఇండస్ట్రీ ఆందోళనలో కూరుకుపోయింది. హైడ్రా కూల్చివేతలు వారి గుండెల్లో గుబులు రేపుతు న్నాయి. ప్రభుత్వం మారినా.. కొందరు సినీ ప్రముఖులు.. కేసీఆర్ కు మద్దతుగా ఉన్నారన్న కారణంతో ఇలా చేస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది. నిజానికి కేసీఆర్ సమయంలోనూ ఇండస్ట్రీ తటస్థంగా ఉండేందుకు ప్రయత్నించింది. కానీ, అప్పట్లోనూ ఉండనివ్వలేదు.
మా దగ్గర ఉంటూ.. మాకు అనుకూలంగా లేకపోతే.. చర్యలు తప్పవన్న ధోరణితోనే.. కేసీఆర్ సర్కారు కూ డా నడుచుకుందనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఉద్యమ సమయంలో అయితే.. తెలుగు ఇండస్ట్రీ పెద్దలు.. బిక్కుబిక్కు మంటూ కాలం గడిపారు. ఇప్పుడు.. అంత పరిస్థితి లేకపోయినా.. తెరచాటున మాత్రం ఏదో జరుగుతోందన్నది చర్చ. అందుకే.. చిరంజీవి ఇటీవల నిర్మాతలకు కొన్ని సూచనలు చేశారు. అయినా.. అవి సరిపోలేదన్నట్టుగానే పరిస్థితి మారింది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 24, 2024 6:08 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…