అప్పుల్లో ఉన్న ఏపీకి చంద్రబాబు వంటి దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి చాలా అవసరమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాదు.. తాను ఎంతో నేర్చుకోవాల్సింది కూడా ఉందని.. చంద్రబాబు నుంచి నేర్చుకునేందుకు అనుక్షణం తపిస్తున్నానని చెప్పారు. తాజాగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 13326 గ్రామాల్లో సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడురులోని మైసూరువారి పల్లెలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ గ్రామం అభివృద్దిపథంలో ముందంజలో ఉండడంతో ఇక్కడ గ్రామసభలో పాల్గొని గ్రామీణుల సమస్యలు తెలుసుకున్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఇక్కడ సభను చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నామని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా గ్రామాలను సర్వనాశనం చేసిందని పవన్ చెప్పారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వాడేసుకుందని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాలకు.. ఏం కావాలనేదానిపై చిత్తశుద్ధితో ఆలోచించాల్సి ఉందన్నారు. అప్పుడు మాత్రమే మంచి జరుగుతుందని చెప్పారు. గ్రామాలు పచ్చగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం పెరుగుతుందని, ప్రతి ఒక్కరి జీవితం కూడా బాగుంటుందని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించాలని.. చట్టాలే చెబుతున్నాయని పవన్ తెలిపారు.
కానీ, ఆ చట్టాలను గత వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పవన్ విమర్శించారు. ఇప్పుడు ఆయా గ్రామాలను బలోపేతం చేయడంతోపాటు.. ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే.. తాము అద్భుతాలు చేయలేమని.. తమ వద్ద మంత్రదండం లేదని పవన్ చెప్పడం గమనార్హం. పనిచేయడం.,. ఫలితాలు రాబట్టుకోవడం తప్ప అద్భుతాలు చేసేందుకు అవకాశం లేదన్నారు. రాష్ట్రాన్ని గట్టెక్కించేది చంద్రాబాబు మాత్రమేనని చెప్పారు.
This post was last modified on August 24, 2024 10:59 am
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…