పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు.. పెట్టేవారినైనా చూపించిందన్న సామెత.. ఏపీ సీఎం చంద్రబాబు , ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో నిజమవుతోందని అంటున్నారు. ఏపీకి భారీ ఎత్తున నిధులు ఇవ్వాలని.. కూటమి సర్కారు పాలన కాబట్టి.. పేరు వస్తుందని.. వచ్చే ఎన్నికల్లోనూ మేలు జరుగుతుందని చంద్ర బాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఇలా చేయడం మోడీకి ఇష్టమూలేదు.. రాజకీయంగా అవకాశమూ లేదు. చంద్రబాబుకు ఇస్తే.. మరికొన్ని మిత్రపక్షాలు.. రెడీగా ఉన్నాయి.
ఇప్పటికే బడ్జెట్ సెగల నుంచి తప్పించుకోలేని పరిస్థితిని మోడీ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఏపీకి ఎలానూ నిధులు ఇచ్చే పరిస్థితి కనిపించనందున.. కొన్ని పెట్టుబడి పెట్టే సంస్థలను ఏపీకి పంపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీలో పర్యటించిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరిగింది. అయితే.. వారు పెట్టుబడులు పెడతారా? లేదా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఒక బూమ్ వచ్చింది.
ఇక, ప్రస్తుతం వచ్చిన వారిని గమనిస్తే.. వీరిలో గోద్రేజ్, ఫాల్కన్ సహా.. పలు కీలక కంపెనీలు వున్నాయి. వాస్తవానికి ఇవినేరుగా వచ్చినవి కావని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేందుకుఇప్పుడు ఏపీకి వచ్చిన సంస్థలు ప్రయత్నించాయి. అయితే.. అక్కడ ఒప్పందాలు కుదర లేదు. దీంతో ఆయా సంస్థలు వెనక్కి తగ్గాయి. వేచి చూస్తున్నాయి. ఈ క్రమంలోనే మోడీ సూచనల మేరకు.. గోద్రెజ్ సహా పలు సంస్థలు ఇప్పుడు ఏపీకి చేరుకుంటున్నాయి.
తాజాగా చంద్రబాబుతో పలు సంస్థల ప్రతినిధులు చర్చలు జరిపారు. గుజరాత్‌కు ఏపీకి తేడా ఏంటంటే.. అక్కడ పన్నుల్లో మినహాయింపులు ఇవ్వడం లేదు. పైగా.. ఆయా కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు చేసే భూసేకరణలో 25 శాతం భారం అవే భరించాలి. దీంతో అక్కడ కంపెనీలు పెట్టేందుకు కంపెనీలు వెనుకాడుతున్నాయి. దీనికి కారణం.. ఇప్పటికే గుజరాత్‌లో భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. కాబట్టి కొత్తగా వచ్చేవారితో పెద్దగా అవసరం లేదు., ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విజ్ఞప్తి మేరకు మోడీ వారిని ఏపీకి పంపిస్తున్నారనేది ఢిల్లీ వర్గాలు చెబుతున్న మాట. అయితే.. ఏదో ఒకరకంగా పెట్టుబడులు అయితే.. వస్తున్నాయి కాబట్టి.. వచ్చే వారిని ఆహ్వానించాలన్న సందడిలో ఏపీ సర్కారు ఉంది.
This post was last modified on August 23, 2024 3:25 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…