Categories: Political News

అన్న క్యాంటీన్ల‌కు నో(కో)ట్ల వ‌ర్షం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాన‌స పుత్రిక‌గా పేర్కొనే అన్న క్యాంటీన్ల‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్ల‌కు విరాళాలు ఇవ్వాల‌ని, పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ చేతులు క‌ల‌పాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. తొలి క్యాంటీన్‌ను ఆయ‌న గుడివాడ‌లో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఆ రోజే ఆయ‌న బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించారు.

ఇక‌, ప్ర‌తి ఒక్క‌రూ క‌ద‌లి రావాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా.. విరాళాల వ‌ర్షం కురిపిస్తున్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కేవ‌లం ఐదు రోజుల్లోనే(ఈ నెల 15-20 మ‌ధ్య‌) 20 కోట్ల రూపాయ‌ల‌కు పైగా నిధులు స‌మ‌కూరాయి.

ఎవ‌రెవ‌రు.. ఎంతెంత‌?

  • సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి తొలి రోజు విరాళం: కోటి రూపాయ‌లు
  • మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఇచ్చింది: కోటి రూపాయలు
  • టీడీపీ నేత, వ్యాపార వేత్త‌ శిష్టా లోహిత్ విరాళం: కోటి రూపాయలు
  • గుంటూరు మున్సిపల్‌ కమిషనర్ పులి శ్రీనివాసులు విరాళం: 25 వేలు
  • గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్ విరాళం: ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని క్యాంటీన్లలో భోజనం ఖర్చు
  • ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు విరాళం: 30 వేలు
  • మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి విరాళం: ఒక జీతం రూ.3.3 ల‌క్ష‌లు
  • మంత్రి గొట్టిపాటి ఫ్యామిలీ ఇచ్చింది: 50 ల‌క్ష‌లు
  • మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు విరాళం: 2 ల‌క్ష‌లు
  • గెజిటెడ్ ఉద్యోగుల సంఘం: ఒక పూట వేత‌నం(సుమారు 50 ల‌క్ష‌లు)
  • సాధార‌ణ ఉద్యోగుల విరాళం: ఒక రోజు వేత‌నం
  • రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల‌కు పైగా సామాజిక పింఛ‌ను దారులు ఇచ్చింది : 3.2 ల‌క్ష‌లు
  • ఎన్నారైల నుంచి అందింది: 2 కోట్ల రూపాయ‌లు

This post was last modified on August 21, 2024 7:59 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago