వేణు స్వామి.. ఈ జ్యోతిష్యుడి గురించి పరిచయం అవసరం లేదు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల భవితవ్యం గురించి జోస్యం చెబుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారీయన. కొన్ని సందర్భాల్లో ఆయన జోస్యాలు ఫలించాయి. చాలానే తేడా కొట్టాయి.
ఐతే సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా వెళ్లిపోయి అవసరం లేని సందర్భాల్లోనూ జోస్యాలు చెప్పడంతో వేణు స్వామి మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. ఇటీవలే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుంటే.. వాళ్లిద్దరూ మూడేళ్లలో విడిపోతారని వేణు స్వామి చెప్పడం దుమారం రేపింది.
ఈ క్రమంలోనే టీవీ5లో సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఒక చర్చా కార్యక్రమం పెట్టి వేణు స్వామిని కడిగి పారేశారు. ఆయన డబ్బులు తీసుకుని రాజకీయ జోస్యాలు చెప్పిన తీరు గురించి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందనే వచ్చింది.
కాగా ఇప్పుడు వేణు స్వామి తన భార్యతో కలిసి లైన్లోకి వచ్చారు. మూర్తి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ వీళ్లిద్దరూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి మూర్తి తనను వేధిస్తున్నాడని.. అప్పట్లో డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడని వేణు స్వామి ఆరోపించారు.
తాను తన జోస్యం ద్వారా ఎందరో జీవితాలను బాగు చేశానని.. కానీ ఇప్పుడు తనకే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని వేణు స్వామి అన్నారు. వేణు స్వామి భార్య మాట్లాడుతూ.. తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. ఆ డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టం అని బెదిరిస్తున్నారని ఆరోపించింది.
తనవి, తన కూతురివి కలిపి నగలు అమ్మినా వాళ్లు డిమాండ్ చేసిన దాంట్లో ఐదు పర్సంట్ కూడా రాదని.. తాము అంత డబ్బు ఎలా కట్టాలని ఆమె ప్రశ్నించింది. తాము ఎలాగూ చచ్చిపోతామని.. ఈలోపు వీళ్ల తప్పులు బయటపెట్టాలనే ఈ వీడియో చేస్తున్నామని వేణు స్వామి భార్య పేర్కొంది.
This post was last modified on August 20, 2024 10:17 am
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…
గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…