ఆళ్ల నాని. ఏలూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, వైసీపీ హయాంలో కాపుల కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల కిందట ఆయన.. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించినట్టు చెప్పారు. తాజాగా ఏలూరులో మీడియాతో మాట్లాడిన నాని.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటానని నాని చెప్పారు. కొన్నాళ్ల కిందట కేవలం తాను ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు. కానీ, ఇప్పుడు వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పార్టీకి ఆయనకు సంబంధం లేకుండా పోయింది. అయితే.. ఏలూరు జిల్లా ప్రజలకు మాత్రం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తానని కూడా అన్నారు.
ఇక, ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై స్పందిస్తూ.. గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరారని, ఈ విషయం పార్టీ రీజినల్ కో – ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న పార్టీ కార్యాలయ స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేసినట్టు చెప్పారు. దీంతో అమెరికాలో ఉన్న యజమాని, తనకు స్నేహితుడు.. ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారని చెప్పారు. దీనిలో ఎలాంటిరాజకీయాలు లేవన్నారు.
ఎందుకీ నిర్ణయం?
వాస్తవానికి ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్) కొన్నాళ్ల కిందట జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పు డు.. ఆయన పార్టీ నుంచి ఓదార్పును కోరుకున్నారు. కానీ, పార్టీ అధినేత మౌనంగా ఉండిపోయారు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడినా.. జగన్ స్పందించలేదు. దీంతో ఆళ్ల నాని మరింత హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీని పూర్తిగా వదిలేశారని అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్ల నాని నిష్క్రమణ పార్టీకి ఇబ్బందేనని అంటున్నారు.
This post was last modified on August 17, 2024 3:58 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…