Movie News

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్ స్లిప్ అయినా చాలు ఆ వీడియోని పట్టుకుని వైరల్ చేయడానికి కొన్ని వందల హ్యాండిల్స్ కాచుకుని ఉంటాయి.

లిటిల్ హార్ట్స్, హే బలవంత్ హీరోయిన్ శివాని నగారంకు ఇది అనుభవమయ్యింది. ఇటీవలే ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు 15 నిముషాలు తనను ఎవరూ టచ్ చేయలేదని, ఒకపక్క గోవిందా నామాలు, ఇంకోపక్క కాత్యాయని భోంచేశావా అంటూ స్లోగన్స్ వినిపించాయని ఎగ్జైట్ మెంట్ తో చెప్పింది.

నిజానికి బ్రేక్ దర్శనానికి వెళ్ళినప్పుడు గోవిందా నామాలు తప్ప ఇంకేం వినిపించవు. ఒకవేళ ఏపీ ముఖ్యమంత్రి వెళ్లినా జై టిడిపి అని ఎవరూ అరవరు. అలాంటిది శివాని కోసం నాన్ స్టాప్ గా నినాదాలు చేశారనేది నమ్మశక్యంగా లేదు.

ఇది పక్కనపెడితే తాను హీరోయిన్ కాబట్టే పదిహేను నిముషాలు నిలబెట్టి దర్శనం చేయించారనే రీతిలో శివాని చెప్పడం వేరే అర్థం తెచ్చింది. టిటిడి అధికారులు చిన్న ప్రముఖులకు సైతం ఇంతేసి సమయం దర్శనం కేటాయించి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో శివాని కొంత ఆలస్యంగా అయినా వివరణ ఇచ్చింది.

ఎయిర్ పోర్ట్ లో శ్రీవాణి దర్శనం టికెట్లు పది వేల రూపాయలు ఇచ్చి కొన్నామని, దాంట్లో భాగంగానే వాకిలి నుంచి లోపలికి వెళ్లి బయటికి వచ్చే దాకా స్వామిని చూసే భాగ్యం పదిహేను నిముషాలు దొరికిందని క్లారిటీ ఇచ్చింది. ఇదేదో ఆ ఇంటర్వ్యూలోనే ముందే చెప్పి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు.

శ్రీవాణి టికెట్ల విషయం దాచి పావు గంట కదలకుండా ఉన్నామని చెప్పడం ఒకరకంగా తప్పే అవుతుంది. ఉద్దేశం మంచిదే అయినా చెప్పే విధానం తేడాగా ఉంటే ఇలాంటి కామెంట్లు చవి చూడాల్సి వస్తుంది. మొత్తానికి శివాని మరో వీడియోతో దీనికి చెక్ పెట్టేసింది కాబట్టి మళ్ళీ ఎవరూ ఆ టాపిక్ ని టచ్ చేయకుండా ఉంటే ఇంకే డిస్కషన్లు రావు.

This post was last modified on February 25, 2026 7:01 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

27 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

34 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

48 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago