మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసంలో పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన వైసీపీ నాయకులు తలో దారి పడుతున్నారు. వీరిలో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ తాజాగా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను పట్టుకున్నారు. గురువారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
దీంతో శంషాబాద్ పోలీసులు విమానాశ్రయంలో అవినాష్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పొంతనలేని సమాధానం ఇవ్వడంతో వారు మంగళగిరి పోలీసుల కు సమాచారమిచ్చినట్టు తెలిసింది. దీంతో అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి నిరాకరించాలని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు.
మంగళగిరి కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇక, ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదంటూ.. కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వీరంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు.. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై చర్యలు నిలిపివేసింది. ఇంతలోనే అవినాష్ తప్పించుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది.
This post was last modified on August 16, 2024 4:08 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…