టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారంటూ.. సీనియర్ నాయకుడు, మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యాలు సంచలనం రేపుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వంటి కీలకమైన ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి వీర విధేయులు.
మిగిలిన వారి విషయంలో ఇంత వీర విధేయత ఉంటుందని భావించలేం. ఉన్నా కూడా.. పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణం ఉన్న నాయకులు కావడంతో వీరిపైనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. తమ పార్టీలోకి చేరేందుకు 5 నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, చంద్రబాబు గేట్లు తీస్తే.. ఇక వారంతా పార్టీ మారిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటు వైపు చూస్తే.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
వైసీపీ నుంచి వచ్చేందుకు రెడీగానే ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా కిక్కిరిసి పోయారు. 164 మందితో కూటమి ప్రభుత్వం కిటకిటలాడుతోంది. ఇలాంటి సమయంలో వారిని తీసుకుని ఏం చేస్తారు? వారు వచ్చినా.. ఏం ప్రయోజనం అన్నది ప్రశ్న. అయితే.. రాజకీయంగా వైసీపీకి దెబ్బ కొట్టేందుకు.. లేదా.. పార్టీకి వాయిస్ లేకుండా చేసేందుకు మాత్రం వ్యూహం పనిచేస్తుందని భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు ప్రస్తుతానికి సుముఖంగా అయితేలేరు.
ఈ నేపథ్యంలో మంత్రి చెప్పిన మాటలు నిజమేనా? లేక, రాజకీయంగా ఆయన వైసీపీని ఆత్మరక్షణలో పడేసేందుకు చెబుతున్నారా? అనేది తేలాల్సి ఉంది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. అన్నట్టుగా వచ్చినా రావొచ్చని.. చంద్రబాబు మనసు మార్చుకోవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నా రు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ఇదే జరిగి 5-8 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే.. జగన్‌కు మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 15, 2024 10:07 am
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…