Political News

ముహూర్తం-మెనూ రెడీ.. పేద‌వాడి పొట్ట‌కు స్వ‌తంత్రం!

పేద‌వాళ్ల ఆక‌లి తీర్చాల‌న్న స‌దుద్దేశంతో ఏపీలో కూట‌మి స‌ర్కారు అన్న క్యాంటీన్ల‌ను తీసుకువ‌చ్చింది. ఆగ‌స్టు 15న దేశానికి స్వాతంత్రం ద‌క్కిన రోజును పుర‌స్క‌రించుకుని పేద‌వాటి పొట్ట‌కు కూడా స్వ‌తంత్రం తీసుకురావాల‌న్న ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి క్యాంటీన్ల‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. తొలి రోజు ఆయ‌న గుడివాడ నియోజ‌వ‌ర్గంలో అతిపెద్ద క్యాంటీన్‌ను ప్రారంభించ‌నున్నారు. మ‌రుస‌టి రోజు నుంచి 99 క్యాంటీన్ల‌ను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభించ‌నున్నారు.

అన్న క్యాంటీన్న‌లు సంబ‌రాల మ‌ధ్య ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపునిచ్చారు. దీంతో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ క్యాంటీన్ల ఏర్పాటులో నిమ‌గ్న‌మ‌య్యారు. మొత్తంగా తొలి విడ‌త‌లో 100 క్యాంటీన్ల‌ను ప్రారంభించ‌నున్నారు. ఇక‌, ముహూర్తంతో పాటు తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్ల‌లో ఏయే ప‌దార్థాల‌ను పేద‌ల‌కు వడ్డించాలో కూడా స్ప‌ష్టం చేస్తూ.. మెనూను విడుద‌ల చేసింది. వారానికి ఒక వెరైటీ చొప్పున ఈ మెనూను రెడీ చేశారు.

అంతేకాదు.. ఏదో పెట్టామంటే పెట్టామ‌న్న‌ట్టుగా కాకుండా.. దీనికి కూడా లెక్క నిర్ణ‌యించారు. అన్నం ఎంత వ‌డ్డించాలి? కూర‌, సాంబారు, ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటివాటిని ఏ స్థాయిలో అందించాల‌నే విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేశారు. అంటే.. పేద‌లకు మొక్కుబ‌డిగా కాకుండా.. మ‌న‌సు పెట్టి అన్న క్యాంటీన్ల ద్వారా క‌డుపు నింపాల‌న్న ఆశాయాన్ని సంపూర్ణంగా అమ‌లు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీని ప్ర‌కార‌మే మెనూను సీఎం చంద్ర‌బాబు రెడీ చేసిన‌ట్టు తెలిసింది. కేవ‌లం 5 రూపాయ‌ల‌కే ఉద‌యం టిఫిన్‌, మ‌ధ్యాహ్నం రూ.5 కే భోజ‌నం, రాత్రి స‌మ‌యంలోనూ రూ.5కే భోజ‌నం ఈ క్యాంటీన్ల ద్వారా అందిస్తారు.

ఇదీ మెనూ..

సోమ‌వారం: టిఫిన్‌లో ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందిస్తారు. ఇడ్లీ వ‌ద్దంటే.. పూరీ, కుర్మా ఇస్తారు. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల్లోనూ మెనూ మారుతుంది.

మంగళవారం: ఇడ్లీ, చట్నీ, పొడి లేదా సాంబార్ కామ‌న్‌. ఇది వ‌ద్దంటే ఉప్మాతో చట్నీ, మిక్చర్ వడ్డిస్తారు. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాలు ఉంటాయి.

బుధవారం: ఇడ్లీ కామ‌న్‌గా ఉంటుంది. ప్ర‌త్యేకంగా పొంగల్‌తో చట్నీ లేదా సాంబార్ వ‌డ్డిస్తారు. మ‌ధ్యాహ్న భోజ‌నంలో బిర్యానీ పెడ‌తారు. రాత్రికి మెనూ కామ‌న్‌.

గురువారం: ఉద‌యం ఇడ్లీ కామ‌న్‌. ప్ర‌త్యేకంగా పూరీ కుర్మా ఉంటాయి.మ‌ధ్యాహ్నం చిత్రాన్నం లేదా సాధార‌ణ మీల్స్‌, రాత్రికి మామూలు భోజ‌నం.

శుక్రవారం: ఇడ్లీ కామ‌న్‌. ఉప్మా ఉంటుంది. మ‌ధ్యాహ్నం స్వీటు, భోజ‌నం. రాత్రికి భోజ‌నం కామ‌న్‌.

శనివారం: ఇడ్లీ కామ‌న్‌గా ఉంటుంది. ప్ర‌త్యేకంగా కోరుకుంటే పొంగల్‌తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఇస్తారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం, రాత్రి భోజ‌నం కామ‌న్‌.

ఏయే ప‌దార్థాలు ఎంతెంత‌?

  • ఉద‌యం టిఫిన్‌: ఇడ్లీ, పూరీల్లో ఏది కోరుకుంటే అది ఒక్కొక్కరికి 3 చొప్పున ఇస్తారు. ఉప్మా, పొంగల్ అయితే, పావు కిలో వడ్డిస్తారు.
  • మ‌ధ్యాహ్నం: అన్నం 400 గ్రాములు, చట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు. ఇదే మోతాదులో రాత్రి భోజ‌నం ఉంటుంది.

స‌మ‌యాలు ఇవీ..

  • టిఫిన్‌: ఉదయం 7.30 నుంచి 10 గంటల వ‌ర‌కు
  • మధ్యాహ్న భోజనం: 12.30 నుంచి 3 గంటల మధ్య.
  • రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల వ‌ర‌కు.
  • ఆదివారం అన్నా క్యాంటిన్ ల‌కు సెలవు.

This post was last modified on August 14, 2024 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

43 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago