సీఎం చంద్రబాబు.. ఒక వ్యవస్థీ కృత గ్యాప్‌లో పడిపోయినట్టు తెలుస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే సాంకేతికత ఆయన సొంతం. అయితే.. ఇది నిన్నమాట. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఓ వ్యవహారం.. ఆయనకు.. ప్రజలకే కాదు.. ప్రముఖలకు మధ్య గ్యాప్ పెంచేస్తున్నవారు ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రముఖ ఉద్యమ కారిణి, ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణణ్ చేసిన ట్వీట్ చూస్తే.. చంద్రబాబు వరకు కొన్ని విషయాలు చేరడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను వ్యభిచార కూపం నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన ప్రజ్వల సంస్థ ద్వారా సునీతా కృష్ణన్ దక్షిణాదిలో మంచి పేరు సంపాయించుకున్నారు.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. ఆమె ఆయనను కలుసుకునేందుకు, రాష్ట్రంలో మహిళల పురోభివృద్ధిపై చర్చించేందుకు నిర్ణయించుకున్నట్టు ఆమె చేసిన తాజా ట్వీట్‌తో తెలిసింది. అయితే.. ఇప్పటికి పలు మార్లు ఆమె ప్రయత్నించినట్టు తెలిపారు. అయితే..చంద్రబాబు అప్పాయింట్ మెంటు మాత్రం ఆమెకు లభించలేదు. అసలు ఈ విషయం చంద్రబాబు వరకు చేరలేదని కూడా.. ఆమె చేసిన ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబు ట్విటర్‌కే ఆమె పోస్టు పెట్టారు. తను కలవాల్సి ఉందని, తగిన సమయం కేటాయిస్తే.. 10 నిమిషాలు చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
దీనికి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు. ఇదేసమయంలో అప్పాయింట్ మెంటు వ్యవహారంలో జరిగిన లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని కూడా వివరణ ఇచ్చారు. అయితే.. వాస్తవానికి చంద్రబాబుకు అప్పాయింట్‌మెంటు కల్పించే విషయంలో జీఏడీ(సాధారణ పరిపాలన శాఖ) చూడాలి. కానీ, అది పక్కకుపోయి.. ఇప్పుడు పార్టీ కీలక నాయకులు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ గ్యాప్ పెరుగుతున్నట్టు సమాచారం.
ఇలా ఎంత మంది ఆయనను కలుసుకునేందుకు వచ్చి.. అప్పాయింట్‌మెంటు లభించక వెనుదిగారనే విషయంపై సీఎంవో వర్గాలు దృష్టి పెట్టాయి. ఏదేమైనా ఇది వ్యవస్థీకృత లోపంగానే అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
This post was last modified on August 11, 2024 7:13 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…