Political News

చంద్ర‌బాబు పంటికింద ‘రాళ్లు!’

రాష్ట్రంలో ‘రాళ్ల’ సమస్య వచ్చింది. అవికూడా.. అత్యంత ఖ‌రీదైన గ్రానైట్ రాళ్లు. ధ‌న‌వంతుల ఇళ్ల‌లో వేసుకునే రాళ్లు. ఇప్పుడు ఆ రాళ్లను ఏం చేయాలో తెలియ‌క చంద్ర‌బాబు స‌ర్కారు త‌ల‌పట్టుకుంది. పోనీ.. వదిలేద్దామంటే రూ.350 కోట్లు పెట్టి జ‌గ‌న్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగ‌ని వాడ‌దామంటే.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఆ రాళ్ల వ్య‌వ‌హారం.. ఇప్పుడు స‌ర్కారుకు చిక్కుముడిగా మారింది. ఇంత‌కీ.. ఆ రాళ్ల సంగ‌తేంటి? వాటి వెనుక ఉన్న నిజాలేంటి? అప్ప‌టి సీఎం జ‌గ‌న్ అతి తెలివి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

రెవెన్యూ శాఖలో డాక్యుమెంట్లపై జగన్‌ బొమ్మలు వేసుకున్న విష‌యం తెలిసిందే. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల వంటివాటిపై కూడా జగన్‌ బొమ్మ వేసుకున్నారు. అలానే రూ. 22.95 కోట్ల ఖర్చుతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాలపైనా ఆయ‌న ఫొటోలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో జగన్‌ బొమ్మతో ఉన్న స‌ర్వే రాళ్ల వ్య‌వ‌హారం 2022లో పెద్ద దుమారం రేపింది. రాళ్ల‌పై బొమ్మ‌లేంట‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. ఈ సర్వే అనంత‌రం స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించి.. బూముల్లో వీటిని పాతాల‌ని నిర్ణ‌యించారు.

అప్ప‌టి గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కు.. ఇలా 350 కోట్ల‌ను ఖ‌ర్చు చేసి జ‌గ‌న్ త‌న బొమ్మ‌లు వేసుకున్నార‌న్న ప్ర‌చారం ఉంది. సుమారు ఏడు వేల గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీ సర్వే పూర్తయింది. ఇంత‌లో స‌ర్కారు మారి.. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది. అయితే, రీ సర్వేకోసం తెచ్చిన హద్దు రాళ్లపై జగన్‌ బొమ్మ ఉండటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.

ఈ రాళ్లను దేనికి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనలు పలు రకాలుగా సాగుతున్నాయి. కొందరు మంత్రులు ఈ రాళ్లను గుడులు, బడులు నిర్మించేటప్పుడు పునాది రాళ్లుగా ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. అయితే.. అంత ఖ‌రీదు పెట్టి కొన్న రాళ్ల‌ను ఇలా పునాదుల‌కు ఎలా ఉప‌యోగిస్తార‌నేది ప్ర‌శ్న‌. పోనీ.. రాళ్లను అలాగే వదిలేద్దామా? అంటే రూ.350 కోట్లు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఉపయోగిద్దామా అంటే ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉంది. మొత్తంగా వీటిని ఏం చేయాల‌న్న విష‌యంపై చంద్ర‌బాబు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారాయి.

This post was last modified on August 10, 2024 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

49 minutes ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

1 hour ago

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…

2 hours ago

అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ…

2 hours ago

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

2 hours ago

దేవా కట్టాపై రాజమౌళి ప్రేమ,

దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…

3 hours ago