అధికారంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా రెచ్చిపోయారో.. ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని ఎన్నెన్ని మాటలన్నారో.. వాళ్లను ఎంతగా వేదనకు గురి చేశారో తెలిసిందే. అహంకారంతో విర్రవీగిన వాళ్లందరూ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. చరిత్రలో చూడని పరాభవం ఎదుర్కొని అవమాన భారంతో ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పుడేమో కర్మ బూమరాంగ్ అన్నట్లుగా వారి కథ అడ్డం తిరుగుతోంది.
అధికారంలో ఉండగా చేసిన పాపాలు చాలామందిని వెంటాడుతున్నాయి. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ కోవలోనే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. అధికారంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దారుణాతి దారుణమైన మాటలు అన్న వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఒక సందర్భంలో పవన్ వ్యక్తిగత జీవితం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
“ముగ్గురిని నువ్వు ఒక్కడు చేసుకుంటే.. ఒక్కొక్క మగాడు వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏక పత్నీ వ్రతం.. మన మతం. ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో సంసారం చేయడం అన్నది మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్” అంటూ ఒక టీవీ ఛానెల్ చర్చలో విరుచుకుపడ్డారు దువ్వాడ శ్రీనివాస్.
కట్ చేస్తే ఇప్పుడు దువ్వాడ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. శ్రీనివాస్ కొంత కాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడట. తమకు అన్యాయం చేస్తున్నాడంటూ దువ్వాడ మొదటి భార్య కూతుళ్లు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలపడం గమనార్హం. గురువారం రాత్రి వీళ్లు చేపట్టిన ఆందోళనతో దువ్వాడ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం రెండో భార్యతో ఉంటున్న ఇంటి ముందే వాళ్లు ఆందోళన చేపట్టడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. రెండో భార్య ఉన్న వ్యక్తి.. ఏకపత్నీ వ్రతం గురించి నీతులు చెబుతూ పవన్‌ను అన్నేసి మాటలు అన్నాడా అంటూ జనం ఇప్పుడు అవాక్కవుతున్నారు.
This post was last modified on August 9, 2024 12:01 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…