Political News

బంగ్లాదేశ్ ను ఇలా చేసిన ‘కోటా’ హిస్టరీ ఇదే

భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ కు తిరుగులేని అధినాయకురాలిగా మారిన షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయటమే కాదు.. ప్రాణరక్షణలో భాగంగా భారత్ కు వచ్చేసిన పరిస్థితుల్ని చూస్తే.. ఆ దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఇంతటి భారీ ఆందోళనకు.. హింసకు కారణమైన రిజర్వేషన్ల చరిత్ర ఏంటి? ఎందుకిలా జరిగింది? దీని నేపథ్యం ఏమిటి? ఎందుకింత తిరుబాటు చోటు చేసుకుంది? లాంటి అంశాలపై అవగాహనకు చరిత్రలోకి వెళ్లాల్సిందే.

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లను షేక్ హసీనా ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా ఏమీ తీసుకురాలేదు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఆమె తండ్రి తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ల కోటాను కుమార్తె పెంచటం చేశారు. అదే ఆమె అధికారాన్ని పోగొట్టుకోవటమే కాదు.. బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొనేలా చేశాయి.

1976
ఈ ఏడాదిలోనే షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపితగా అభివర్ణించే షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ సివిల్ సర్వీసుల్లో రిజర్వేషన్లను ప్రవేశ పెట్టింది. బంగ్లాదేశ్ విమోచనలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులకు 30 శాతం.. విమోచన యుద్ధ వేళ శత్రుసేనలు (పాకిస్థాన్) చేతుల్లో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలకు10 శాతం రిజర్వేషన్ కల్పించారు.

1996
విమోచనలో పాల్గొన్న వారికి కల్పించే రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చి దాదాపు 20 ఏళ్ల తర్వాత.. వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఈ రిజర్వేషన్లను వారి పిల్లలకు విస్తరించారు.

2009
స్వాతంత్య్ర సమరయోధుల మనవళ్లు.. మనవరాళ్లకు కూడా ఈ రిజర్వేషన్ల కోటాను విస్తరించారు. ఇక్కడే అసంత్రప్తి మొదలైంది.

2013
బీసీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో పాస్ కాకున్నా.. కొన్నివందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు మొదలు పెట్టారు.

2018
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలన్న ఆందోళనలు భారీగా మొదలయ్యాయి. బంగ్లాదేశ్ జనరల్ కేటగారి విద్యార్థుల హక్కుల పరిరక్షణ పేరుతో పోరు షురూ చేవారు. ప్రథమ.. ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని హసీనా ప్రభుత్వం నిర్ణయించింది.

2021
ప్రథమ.. ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించకపోవటాన్ని తప్పుపడుతూ బంగ్లాదేశ్ హైకోర్టు డివిజన్ లో రిట్ పిటిషన్ దాఖలైంది.

2024
ఈ ఏడాది జూన్ 5న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయటం చట్ట విరుద్ధమని తీర్పును కోర్టు ఇచ్చింది. దీంతో.. రద్దు చేసిన రిజర్వేషన్ల కోటా పునరుద్ధరన జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మొదలయ్యాయి.

2024, జులై 1- జులై 21
రిజర్వేషన్లను తిరిగి తీసుకురావటం పై వర్సిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చారు. అధికార అవామీలీగ్ పార్టీ మద్దతుదారులను సివిల్ సర్వీసుల్లోకి తీసుకొచ్చేందుకే కోటాను ఉపయోగిస్తున్నట్లుగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో.. కోటా పునరుద్ధరణను నెల పాటు నిలిపివేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి.. వాటిని మద్దతు ఇస్తున్న వారికి మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. చూస్తుండగానే ఈ మరణాలు అంతకంతకూ ఎక్కువ అయ్యాయి. 2500 మంది వరకు ఆందోళనకారులు గాయపడ్డారు. రిజర్వేషన్ల శాతాన్ని కుదిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నా నిరసనలు తగ్గలేదు.

2024, ఆగస్టు 4 – 5
అనూహ్యంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే నిరసనకారులకు.. ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్లు పెరిగాయి. సోమవారం అనూహ్యంగా వేలాదిమంది నిరసనకారులు రోడ్ల మీదకు రావటం.. పార్లమెంట్ భవనంలోకి.. ప్రధాని నివాసంతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటిపై దాడి చేశారు. ఆర్మీ రంగంలోకి దిగటం.. ప్రధాని హసీనాను రాజీనామా చేసి.. దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలన్న ఆదేశంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలు మొదలయ్యాయి. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. భారతదేశానికి వచ్చేశారు. కొన్నాళ్లు భారత్ లో ఆశ్రయం పొందేందుకు వీలుగా ఆమె ఢిల్లీకి చేరుకున్నారు.

This post was last modified on August 6, 2024 12:51 pm

Share
Show comments
Published by
Satya
Tags: bangladesh

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

4 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

4 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

5 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

5 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

8 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

9 hours ago