టీడీపీ అధినేత చంద్రబాబు షాకయ్యే పరిస్థితి ఏర్పడింది. పార్టీ కార్యాలయంలో రోజూ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు తన వంతుగా ఆయన హాజరవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోటెత్తి తమ సమస్యలు విన్నవిస్తున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న సమస్యలు చూసి చంద్రబాబు నాయుడు షాక్ అవుతున్నారు. ఎక్కువగా భూములకు సంబంధించిన వివాదాలు భూకబ్జాలకు సంబంధించిన అంశాలు వైసిపి నాయకుల ఆగడాలకి సంబంధించిన కేసులు చూసి ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
నిజానికి ఇన్ని సమస్యలు ఉంటాయని చంద్రబాబు సైతం ఊహించలేదు. ఎక్కడ ప్రజాదర్బార్ పెట్టినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. వీటిలో ఎక్కువగా భూములకు సంబంధించిన కేసులో ఉండడం తమ భూములను వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారని, పెద్ద ఎత్తున ఆరోపించడం, వీటికి సంబంధించి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అంటే అసలు వైసిపి హయాంలో ఏం జరిగింది అన్న అంశంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఐపీఎస్, ఇద్దరు ఐఏఎస్‌లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కేవలం భూములు వివాదాలకు సంబంధించిన అంశాలపై పరిష్కారం చూపించేలా ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో వైయస్ జగన్ బంధువులే తమ భూమిని ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు చంద్రబాబును ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇలాంటి ఆరోపణ ఎప్పుడూ రాలేదు. అలాంటిది వైసిపి హయాంలో తొలిసారి తమ భూములను ఆక్రమించుకున్నారు అంటూ పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ కన్నీరు మున్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేయడం చంద్రబాబును కలిచి వేసింది.
దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆయన దృష్టి పెట్టారు. నిజానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇటువంటి భూ వివాదాల విషయంలో వీటిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందనే విషయంపై ప్రభుత్వం ఆలోచనలో పడ్డం ఇప్పుడు చర్చనీయాంశం. ఒక్క పులివెందులలోనే కాకుండా కీలకమైన నెల్లూరు అనంతపురం జిల్లాల్లో కూడా ఇదే తరహా కేసులు వెలుగు చూస్తుండడంతో వీటిపై ఏం చేయాలనేది చంద్రబాబుకు ఒక రకంగా తలనొప్పి గానే మారిందని చెప్పాలి. దీంతో చంద్రబాబు ఇలాంటి కేసులు పరిశీలించేందుకు అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఎంతతవరకు పరిష్కారం లభిస్తుందో చూడాలి.
This post was last modified on August 4, 2024 7:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…