తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క తన విశ్వరూపం చూపించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమె వరుసగా రెండో రోజు కూడా.. టాక్ ఆఫ్ ది సెషన్‌గా నిలిచారు. తొలుత బుధవారం సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం.. హామీలు ఇచ్చింది ఎవరు? వాటిని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందెవరు? అంటూ ప్రవ్నించారు. సన్నాసులు గ్రూప్ టూ వాయిదా వేయమంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న మంత్రి సీతక్క.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తాము చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని.. ప్రతిపక్షాలే సంతృప్తిగా లేవని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు ఓర్పుగా ఉండాలని సూచించారు. ఈ సమయంలోనే పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని సీతక్క దుయ్యబట్టారు.
పదేళ్లపాటు బీఆర్ ఎస్ అధికారంలో ఉండి కూడా.. ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయిందని సీతక్క ప్రవ్నించారు. ఆశా వర్కర్ల ఉద్యమాన్ని ప్రశ్నిస్తున్నవారు..వారి కుటుంబాల్లోని ముసలివారికి.. పింఛన్లు ఎందుకు తీసేశారని నిప్పులు చెరిగారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారి కుటుంబాలలోని తల్లిదండ్రుల పింఛన్‌ను కూడా తీసేసింది .. మీరు కాదా? అని కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నలు గుప్పించారు. ధరణి పేరుతో పెద్ద కార్యక్రమం చేపట్టామనిచెప్పుకొనే వారు.. కనీసం పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు.
దీంతో పదే పదే కేటీఆర్ మంత్రి సీతక్క ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఆమె చెబుతున్న లెక్కలన్నీ తప్పులని వ్యాఖ్యానించారు. తమ హయాంలో ఏ ఒక్కరి పింఛను తీసేయలేదన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే.. స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురినీ శాంతింప చేశారు.
This post was last modified on July 31, 2024 2:54 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…