గత వారం రోజులుగా వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి పేరు మీడియాలో వస్తోంది. దీనికి కారణం.. విశాఖ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం భీమిలి బీచ్ వద్ద సముద్ర తీరానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ. దీనిని కూల్చివేయాలన్నది.. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి డిమాండ్. అయితే.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నది నేహా తరఫు వాద న. దీంతో అసలు ఇది ఎలా వివాదం అయిందనేది ప్రశ్న.
వైసీపీ అధికారంలో ఉండగా.. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు విశాఖలో తమ వ్యాపారాలను విస్తరిం చుకున్నారు. ఈ క్రమంలోనే భీమిలి పర్యాటక ప్రాంతానికి సమీపంలో నేహా రెడ్డి ఓ అంతర్జాతీయ స్పా సెంటర్ నిర్మించుకున్నారు. కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. దీనికి వైసీపీ సర్కారు అనుమతి ఇచ్చింది. అయితే.. ఇది సముద్రతీరానికి అతి సమీపంలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో భారీ ప్రహరీని నిర్మించేందుకు నేహా సిద్ధమయ్యారు.
దీనికి పర్యావరణ అనుమతులు అవసరం. ఇదే విధంగా జీవీఎంసీ అనుమతులు కూడా అసవరం. అప్పట్లో వైసీపీనే జీవీఎంసీలో ఉంది కనుక.. వాటికి అనుమతులు వచ్చాయి. కానీ, పర్యావరణ అనుమతులు రాలేదు. దీనికి ఆమె దరఖాస్తు చేశారో..లేదో కూడా తెలియదు. ఈ నిర్మాణం.. వైసీపీ హయాంలో గత ఏడాదే ప్రారంభమైంది. కానీ, నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే కొన్ని అవాంతరాలతో ఆలస్యమైంది. ఇక, ఆ తర్వాత.. అప్పట్లోనే పీతల మూర్తి.. దీనిని విభేదిస్తూ.. పార్టీ నాయకులకు ఫిర్యాదులు చేశారు.
అప్పట్లో సంగతి ఎలా ఉన్నా.. పార్టీ అధికారంలోకి వచ్చాక.. పీతల మూర్తి హైకోర్టును ఆశ్రయించి.. కట్టడాన్ని కూల్చేయాలని కోరారు. దీనిని విచారించిన.. అప్పటి ధర్మాసనం.. నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. ఆదేశించింది. అంతేకాదు.. జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ నిర్మాణాన్ని కూల్చేసేందుకు.. అధికారులు రెడీ అయ్యారు. కానీ, దీనికి జీవీఎంసీ అధికారులు అనుమతి ఇచ్చారని.. కాబట్టి తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ.. మరోసారి నేహా రెడ్డి కోర్టుకు వెళ్లారు.
అయితే.. దీనిని విచారించేందుకు ధర్మాసనం నిరాకరిస్తూ.. సింగిల్ జడ్జి వద్దేతేల్చుకోవాలని చెప్పింది. ఈ పరిణామాలతో నేహా రెడ్డి మరోసారి సింగిల్ జడ్జిని అప్రోచ్ అయ్యారు. ఆయనేమో… తన చేతిలో ఏమీ లేదని..గతంలో నిర్మాణాల విషయంలో ధర్మాసనం
ఆదేశాలు ఇచ్చింది కాబట్టి.. నేనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేనన్నారు. మరోవైపు.. అధికారులు కూల్చివేత కార్యక్రమాలకు రెడీ అయ్యారు. కానీ, హైకోర్టులో అటు ధర్మాసనం, ఇటు సింగిల్ జడ్జి వద్ద తాను పిటిషన్లు వేశానంటూ.. నేహారెడ్డి చెబుతున్నారు. ఫలితంగా ఈ వ్యవహారం ఎటూ తేలకపోగా.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
This post was last modified on July 30, 2024 5:44 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…