Political News

అనంత వైసీపీలో క‌ల‌కలం.. నేత‌లు ప‌రార్‌…!

అనంతపురం వైసీపీలో తీవ్ర రాజకీయ రగడ చోటుచేసుకుంది. నాయకులు ఎవరూ కనిపించడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎన్నికల అనంతరం ముఖ్యంగా ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక్కరు మాత్రమే రెండు మూడుసార్లు మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తప్పుల‌ని ఎత్తిచూపించారు. తమవల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని, అధికారులు తమను పక్కదారి పట్టించారని దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పారు.

తాము కూడా నియోజకవర్గంలో ఏమి చేయలేని పరిస్థితి వచ్చిందని వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని ఆన్లైన్ ఛానల్ల‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మొత్తంగా ఆయన తప్ప వైసీపీలో ఇంకెవరు బయటకు రాలేదు. కనీసం మాట్లాడలేదు. ఇప్పటికీ 50 రోజులు గడిచిపోయింది. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా జ‌రిగిన‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత తీసుకువ‌చ్చారు.

వాటిపై సాధ్యమైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని కోరడం ఆయన కూడా అనంతపురం విషయాన్ని స్పెషల్ గా చూస్తున్నాన‌ని.. అనంతపురంలో అనంతమైన అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదు కాగా మున్ముందు మరింత మందిపై కేసులు పెడతారు అనే చర్చ నడుస్తుంది. మరి దీన్ని ముందుగానే ఊహించారో.. లేకపోతే వైసీపీలో ఉండి నెట్టుకు రావడం చాలా కష్టమని భావించారో తెలియదు కానీ వైసీపీ నాయకులు ఎవరు బయటకు రావట్లేదు.

అసలు అనంతపురంలో వైసిపి ఉందా అంటే కూడా సందేహంగా మారింది. ఆ రకంగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జెండా మోసే నాయకుడు లేడు. పార్టీ వాయిస్ వినిపించిన నాయకులు కూడా లేరు. ఇక ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన కల్యాణదుర్గం నాయకులు తిరిగి మళ్లీ టిడిపి గూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అనేక అక్రమాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఆయనపైన విచారణ చేయాలని పెనుకొండ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సవిత అంతర్గ‌త‌ చర్చల్లో చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మ‌రోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం మౌనంగా ఉంటున్నారు. గతంలో ఆయన చేసిన అశ్లీల వీడియోకి సంబంధించిన వ్యవహారం ఇంకా సర్దుమణ‌గ‌లేదు. దానిపై ఇంకా కేసులు నమోదు అయితే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చగా నడుస్తుంది. సో ఈ పరిణామాలు గమనిస్తే అనంతపురం వైసీపీలో పరిస్థితి దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఏ కేసులు ఎప్పుడు పెడతారో తెలియదు అని భావిస్తున్న వైసిపి నాయకులు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

This post was last modified on July 28, 2024 11:18 am

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

2 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

2 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

4 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

5 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

6 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

6 hours ago