ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సాగుతున్న నీతి ఆయోగ్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్దిని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ – 2047’ అంటూ.. ప్రకటించిన దరిమిలా.. దీనికి పోటీగా చంద్రబాబు వికసిత్ ఏపీ-2047ను చంద్రబాబు ప్రకటించారు. వచ్చే 2047నాటికి ఏపీని ఎలా డెవలప్ చేస్తామనే విషయాన్ని ఆయన విశదీకరించారు. మొత్తంగా 22 నిమిషాల పాటు నీతి ఆయోగ్ భేటీలో మాట్లాడిన చంద్రబాబు అనేక విషయాలు వెల్లడించారు.
గతంలో ‘విజన్-2020’ ఆవిష్కరణ నుంచి ప్రస్తుత వికసిత ఏపీ-2047 వరకు చంద్రబాబు పలు అంశాలను వివరించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కూడా ఆయన ఉటంకించడం విశేషం. అమరావ తి నిర్మాణం జరిగితే.. ఒక్క ఏపీ మాత్రమే లాభపడుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ, నవ నగరాలను నిర్మించడం ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలు అమరావతికి వచ్చే అవకాశం ఉంది. తద్వారా.. దేశానికి ఆదాయం పెరుగుతుంది.
అదేవిధంగా దేశంలోని ఎక్కడివారైనా అమరావతిలో ఉపాధి, ఉద్యోగాలు పొందేందుకు.. ఛాన్స్ ఉంటుంది. ఇది దేశ జీడీపీని పెంచుతుంది అని చంద్రబాబు వివరించారు. అదేవిధంగా అమరావతి నిర్మాణం.. దేశ ప్రగతికి దోహదకారిగా మారుతుందని చంద్రబాబు చెప్పారు. న్యాయ రాజధానిలో ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్‌ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఐటీ, ఏఐ వంటి కీలక రంగాలకు అమరావతిలో పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు.
ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా నీతి ఆయోగ్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. “పోలవరం ప్రాజెక్టు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా.. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటిని అందించే బృహత్తర అవకాశం ఉంటుంది. తద్వారా 8 లక్షల ఎగరాల సాగుభూమి అందుబాటులోకి వుంటుంది.” అని చంద్రబాబు వివరించారు.
అలాగే.. నదుల అనుసంధానాన్ని తన కలగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంలో కొంత ప్రయత్నం జరిగిందని.. ఇది దేశవ్యాప్తంగా జరిగితే.. ఏటా కొన్ని కోట్ల క్యూసెక్కుల నీటిని సముద్రంలో కలవకుండా.. ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
This post was last modified on July 27, 2024 7:00 pm
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…