అధికారంలో ఉన్నపుడే కాదు.. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన సోదరి షర్మిళతో తలపోటు తప్పట్లేదు. జగన్‌ను అధికారం నుంచి దించడంలో తన వంతు పాత్ర పోషంచిన షర్మిళ.. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఎటాక్ ఆపట్లేదు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల మీద జరిగిన దాడులపై ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా మీద ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ షర్మిళ వేసిన ప్రశ్నలకు వైసీపీ నేతల నుంచి సమాధానమే లేకపోయింది.
ఇక ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని పిలిచినా రాలేదని, కాంగ్రెస్ పార్టీ మద్తతు పలకలేదని జగన్ చేసిన విమర్శల మీద తాజాగా షర్మిళ స్పందించింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా జగన్‌కు ఆమె సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది. బుల్లెట్లలా ఉన్న ఆ ప్రశ్నలకు జగన్ అండ్ కో సమాధానం చెప్పే పరిస్థితి ఎంతమాత్రం ఉండదన్నది స్పష్టం. ఇంతకీ షర్మిళ ఏమందంటే..?
“కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది భలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు” అని షర్మిళ పేర్కొంది.
This post was last modified on July 27, 2024 3:26 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…