Political News

హ‌త్య‌ల‌పై నెంబ‌ర్ గేమ్‌.. వాస్త‌వం ఏంటి.. ?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా నెంబ‌ర్లు వివ‌రించారు.

త‌మ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాదాపు35-36 మంది హ‌త్య‌ల్లో దారుణంగా చ‌నిపోయార‌న్న‌ది జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌. వినుకొండ‌లో జ‌రిగిన దారుణ ఘ‌ట‌న త‌ర్వాత‌.. ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా కూడా చేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి గ‌డిచిన 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా క‌ల్లోలం అయితే జ‌రిగింది. అదేస‌మ‌యంలో హ‌త్య‌లు కూడా జ‌రిగాయి. కానీ, ఇంతగా 35 మంది హ‌త్య‌ల‌కు గుర‌య్యాయా? అనేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపైనే రాజ‌కీయాలు కూడా.. న‌డుస్తున్నాయి. అధికార ప‌క్షం నుంచి నెంబ‌ర్ గేమ్‌కు ఫుల్ స్టాప్ పెట్టే చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మంత్రి వంగ‌ల‌పూడి అనిత సహా సీనియ‌ర్ నేత‌లు ఈ నెంబ‌ర్ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. దీనికి త‌గిన ఆధారాలు ఉంటే ఇవ్వాల‌ని కూడా చెబుతున్నారు. అయితే.. వైసీపీ నుంచి నెంబ‌ర్లు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, ఈ క్ర‌మంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు.

జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని హోం శాఖ‌ వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని, ఒకరు వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక, పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది. సో.. వాస్త‌వం ఇదేన‌ని హోం శాఖ చెబుతుండ‌గా.. వైసీపీ మాత్రం కాదు.. 35 మంది చ‌నిపోయార‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 23, 2024 3:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

1 hour ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

2 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

2 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

2 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

3 hours ago

ట్రంప్ కేబినెట్ నిండా బిలియనీర్లే

అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…

4 hours ago