కేంద్ర బడ్జెట్‌లో కొన్ని వరాలు ప్రకటించారు మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా ప్రస్తుతం గ్రాము 7000 దాటిపోయిన బంగారంపై కొంత ఊరట కల్పించారు. బంగారం కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా.. దేశీయ మార్కెట్ బంగారం ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అదేవిధంగా ధనవంతులు మాత్రమే ధరించే ప్లాటినమ్ ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. వీటిపై కూడా కస్టమ్ డ్యూటీని 6.4 శాతానికి తగ్గించనున్నారు.
దేశంలో ప్రస్తుతం స్టార్టప్‌లకు కేంద్రంగా ఉన్న మొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా.. బేసిక్ మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న కస్టమ్ డ్యూటీని తగ్గించనున్నట్టు.. నిర్మలా సీతారామన్ ప్రకటించారు.త ద్వారా దేశంలో మొబైల్ వినియోగం పెంచడంతోపాటు ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం యువత 26 శాతం మంది మొబైల్ వ్యాపారంలో ఉన్నారు. దీంతో ఈ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అయింది.
ఇక, దేశంలో కేన్సర్ రోగులకు ఊరటకలిగిస్తూ.. బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. కేన్సర్ రోగుల మందుల పై సుంకం పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రాణాధారమైన మూడు ఔషధాలపై నా సుంకాలను ఎత్తి వేస్తున్నట్టు నిర్మలమ్మ ప్రకటించారు. అదేవిధంగా 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేశారు. వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు.,
2 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు ద్వారా.. వస్తు, ఆభరాలను చౌకగా అందించనున్నట్టు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం చేపట్టనున్నా రు. అలాగే.. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేయను న్నారు. తద్వారా వలస కూలీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయనున్నట్టు తెలిపారు.
This post was last modified on July 23, 2024 1:53 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…