కళ్ల ముందు కుమారుడి భవిష్యత్తు కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు.. కుమారుడిని అరెస్టు చేయడం పక్కా అనే సమాచారం అందిపోయింది. దీని నుంచి కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. దీంతో సెంటిమెంటు అస్త్రాలను ప్లే చేయడం ప్రారంభించారు… వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎన్నికల అనంతరం.. తిరుపతి జిల్లా చంద్రగిరిలో భారీ విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
టీడీపీ తరఫున పోటీ చేసి.. విజయం దక్కించుకున్న పులివర్తి నానీని టార్గెట్ చేసుకుని దాడులు, విధ్వంసాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. దీంతో కేసులు నమోదయ్యాయి. ఏకంగా జిల్లా ఎస్పీని బాధ్యుడిని చేస్తూ.. బదిలీ చేసిన విషయం కూడా అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడిగా.. ఈకేసులో ఉన్నాడని భావిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు.. బెయిల్ వంటివి ఎవరైనా ఆశ్రయిస్తారు. కానీ, ఈ కేసులో బెయిల్ కూడా లభించే అవకాశం లేకపోవడంతోనో.. లేక మరే కారణమో.. తెలియదు కానీ.. చెవిరెడ్డి.. సెంటిమెంటు బాట పట్టారు. “మేం అధికారంలో ఉన్నప్పుడు.. నానీకి అది చేశా.. ఇది చేశా.. వ్యాపారాలు దెబ్బతినకుండా చూశా” అంటూ.. సెంటిమెంటు ప్లే చేశారు. తాము వ్యాపారాలను దెబ్బకొట్టాలని.. పొట్ట కొట్టాలని చూడలేదని.. కేవలం నానీని ప్రత్యర్థిగానే చూశానని చెవిరెడ్డి చెప్పారు.
“నానీ క్వారీలపై అధికారులు దాడులకు వస్తే.. నేనే ఆపించా. పొట్ట కొట్టద్దని చెప్పా. నాని లారీలు ఒక్క రోజు కూడా.. ఎవరూ ఆపలేదు. వ్యాపారం సాగిపోయింది. ఒకరి పొట్టకొట్టే పనులు చేయవద్దని ఆ రోజు సదరు అధికారితో నేను మాట్లాడా. ఏనాడూ పులివర్తి నానిని శత్రువులా భావించలేదు. ప్రత్యర్థిగా మాత్రమే చూశాను”. అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇప్పుడు చెవిరెడ్డి ఆవేదన తన కుమారుడిని అరెస్టు నుంచి ఆపుకోవడమేనని తెలుస్తోంది. మరి ఈ వాదనలో నానీ ఏకీభవిస్తారా? మోహిత్‌రెడ్డి అరెస్టును వద్దని చెబుతారా? చూడాలి.
This post was last modified on July 21, 2024 9:54 am
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…
గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…
ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…