ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 16 మంది ఎంపీలతో కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వానికి వెన్నెముకలా మారాడు. ఈ నేఫథ్యంలో ఈ ఐదేళ్లలో కేంద్రం నుండి వీలైనన్ని ఎక్కువ నిధులు, ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ పరిశ్రమలు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టించాలని దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రానికి అనేక వినతులు వెళ్లడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అక్కడ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాలలో ఆ ఫైళ్లు ముందుకు సాగడం వాటిని ఆమోదింపచేసుకోవడమే అసలైన సమస్య. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య రాయబారులుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు 16 మంధి ఎంపీలకు వివిధ శాఖలను అప్పగించి ఆయా శాఖల ఫైళ్లను క్లియర్ చేయించుకుని తీసుకురావాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 22 నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఎంపీలకు శాఖలను అప్పజెప్పనున్నట్లు తెలుస్తుంది.
ఈ మేరకు పార్టీ ఎంపీలను తీసుకువెళ్లి కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇప్పించి ఆ ఫైళ్లను క్లియరెన్స్ చేయించే బాధ్యతను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న లావు శ్రీక్రిష్ణ దేవరాయలకు అప్పగించారు. కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, రాజకీయ, పార్లమెంటరీ వ్యవహారలలో కీలక సభ్యుడిగా ఆయన అందరు మంత్రులతో సన్నిహితంగా ఉండి కీలక ఫైళ్లను క్లియర్ చేయించే బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది.
ఎన్డీఎలో టీడీపీ ప్రస్తుతం కీలక భాగస్వామి. టీడీపీ తరపున గెలిచిన వారిలో అనేక మంది విద్యాధికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో టీడీపీకి చెందిన వారికి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. వీరంతా ఆ బాధ్యతలు చేపట్టాక ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సాన్నిహిత్యం పెంచుకుని ఏపీకి సంబంధించిన వాటిని సాధించుకుని రావాలని చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తుంది.
This post was last modified on July 13, 2024 11:08 am
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…
మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…