తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. 2014లో మల్కాజ్ గిరి ఎంపీగా టీడీపీ టికెట్ దక్కించుకుని రాజకీయ అరంగేట్రం చేసిన మల్లారెడ్డి ఆ తరువాతి పరిణామాలలో బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.
2014లో మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించిన రేవంత్ రెడ్డి తనకు మల్లారెడ్డి అడ్డురావడంతో ఆయన విద్యాసంస్థల మీద అప్పట్లో టీడీపీలోనే ఉంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి నుండే మల్లారెడ్డికి, రేవంత్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక 2018 తర్వాత మంత్రిగా మల్లారెడ్డి ఉండగా, మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ ఉన్నాడు. ఈ సమయంలో కూడా ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు హాట్ హాట్ గా నడిచాయి.
ఇక గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మల్లారెడ్డికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలను టార్గెట్ చేసి అనుమతులు లేవని, దారి లేదని భవనాలను కూల్చడం, రహదారులను తవ్వడం చేశారు.
దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు బెంగుళూరు వెళ్లి అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ ద్వారా చక్రం తిప్పి కాంగ్రెస్ అధిష్టానం ద్వారా గ్రీన్ సిగ్నల్ తీసుకుని పార్టీలో చేరాలని భావించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇక లాభం లేదు అనుకుని బీజేపీ వైపు చూశారు. అయితే అక్కడి నుండి కూడా ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సైలెంట్ అయ్యారు.
అయితే ఇటీవల ఏపీలో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం, ఇటీవల తెలంగాణ పర్యటనలో ఇక్కడ టీడీపీని బలోపేతం చేస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మల్లారెడ్డి తాను రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీలో చేరడమే ప్రస్తుతానికి తనకు సేఫ్ అన్న ఆలోచనకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఇక బీజేపీకి కేంద్రంలో ప్రభుత్వం కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ మద్దతు తప్పనిసరి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలలో చేరికకు అవకాశాలు లేని నేపథ్యంలో టీడీపీలో చేరితే అటు కేంద్రం నుండి, ఇటు రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం నుండి ఇక్కట్లను తప్పించుకోవచ్చు అన్న ఆలోచన మల్లారెడ్డి చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా ? వికటిస్తుందా ? వేచిచూడాలి.
This post was last modified on July 11, 2024 10:09 am
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…