తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన తన సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కడపలో ఎంపీ స్థానానికి.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోందన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఉప ఎన్నిక జరిగితే.. ఆ స్థానంలో తాము తమ పౌరుషాన్ని చూపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిలను గెలిపించుకునేందుకు గల్లీ గల్లీలోనూ తిరుగుతామన్నారు.
కాంగ్రెస్ ఎక్కడైతే.. పోగొట్టుకుందో..అక్కడ నుంచి తిరిగి సంపాయించుకుంటామని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామన్నారు. ఏపీలో షర్మిల చేస్తున్న ప్రయత్నాలు పార్టీని బలోపేతం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కడపలో ఉప ఎన్నిక వస్తే.. షర్మిల గెలుపు పక్కా అని రేవంత్ అన్నారు. దీనికి గాను తామంతా కడపలో మకాం వేసి మరీ.. అక్కడి ప్రతి గల్లీలోనూ తిరిగి పార్టీని, షర్మిలను గెలిపించుకుని కడప పౌరుషాన్ని, కాంగ్రెస్ పౌరుషాన్ని కూడా ఢిల్లీ వరకు వినిపించేలా చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని.. ఆ పాత్రను షర్మిల నిర్విఘ్నంగా పోషిస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమస్యలను ప్రస్తావించడంలోనూ.. ప్రశ్నించడంలోనూ కూడా షర్మిలకు షర్మిలే సాటి అని చెప్పుకొచ్చారు. షర్మిలకు తామంతా అండగా ఉంటామని.. రాష్ట్రంలో పార్టీని డెవలప్ చేసే క్రమంలో ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ చెప్పారు. ఏపీలో ఉన్నది కేవలం అధికార పార్టీనేనని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
కాగా.. కడపలో ఉప ఎన్నిక వ్యవహారంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోనూ పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో ఏపీపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేయలేక పోయారు. కానీ, ఈ సారి కనుక ఉప పోరు వస్తే.. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగమే వచ్చి ఇక్కడ కూర్చున్నా ఆశ్చర్యం లేదని.. వైసీపీకి మరింత డ్యామేజీ ఖాయమని తెలుస్తోంది.
This post was last modified on July 9, 2024 2:16 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…