ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్ట పరిధిలోనే అక్రమార్కుల పని పట్టే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాకినాడలో అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం గట్టిగానే ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వైసీపీ అక్రమాలను బయటికి తీసే పని మీద ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఐతే జగన్ హయాంలో మరుగున పడిపోయిన ఓ సంచలన వ్యవహారం గుట్టు బయటికి తీయాలని జనం కోరుకుంటున్నారు. అదే.. విశాఖపట్నంలో మార్చిలో పట్టుబడ్డ భారీ డ్రగ్ కంటైనర్ వ్యవహారం. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారం సంచలనం రేపింది. జాతీయ స్థాయిలో దీని గురించి చర్చ జరిగింది. కానీ తర్వాత అది మరుగున పడిపోయింది.
ఒక భారీ కంటైనర్లో టన్నుల కొద్దీ డ్రగ్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఒక నిపుణుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ అంతటిని సరఫరా చేస్తే దేశంలో సగం మందిని మత్తులో ముంచేయొచ్చని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఒక రాష్ట్రంలో అడుగు పెట్టడం అసాధ్యమని కూడా చెప్పారు. ఐతే వైసీపీ ప్రభుత్వం మాత్రం అది టీడీపీ వాళ్లదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
నిజంగా టీడీపీ వాళ్లు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే.. ఆ పార్టీని ఇరికించకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం వదిలి పెట్టేదా.. దాన్ని ఎన్నికల అంశంగా మార్చకుండా ఉండేదా అన్నది ప్రశ్న. అప్పటి ప్రభుత్వ పెద్దల హ్యాండ్ కచ్చితంగా ఇందులో ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఐతే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టేశారు.
విశాఖలో డ్రగ్స్ కంటైనర్‌ను పట్టుకుంది సీబీఐ వాళ్లు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉంది. అంతే కాక కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉంది. ఈ డ్రగ్ రాకెట్ గుట్టంతా బయటికి తీయడం కష్టమేమీ కాదు. ఇందులో వైసీపీ నేతల భాగస్వామ్యాన్ని బయటపెట్టగలిగితే ఆ పార్టీకి జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on July 6, 2024 4:51 pm
నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా…
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…