ఘోర ఓటమి తర్వాత తగులుతున్న వరుస దెబ్బలతో జేసి ఫ్యామిలి బాగానే కుంగిపోయిన్నట్లుంది. పైగా మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డిని కేసుల విషయంలో జైలుకు తీసుకెళుతుండటం కూడా జేసి కుటుంబంపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. అందుకనే మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి తన ఫాం హౌస్ లో నుండి అడుగు బయట పెట్టటం లేదట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరిప్పితే తనకు కూడా ఏమవుతుందో ఏమో అన్న భయంతోనే మాజీ ఎంపి ఎవరికీ అందుబాటులో కూడా ఉండటం లేదట.
వాస్తవానికి మొన్నటి ఎన్నికలకు ముందు సుమారు 30 ఏళ్ళు జేసి ఫ్యామిలికి ఎదురన్నదే లేదని చెప్పాలి. 1983లో స్వతంత్ర అభ్యర్దిగా పోటి చేసిన ఓడిపోయిన దివాకర్ రెడ్డి తర్వాత 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటి చేసి గెలిచారు. అప్పటి నుండి వరుసగా ఆరుసార్లు కాంగ్రెస్ అభ్యర్ధిగానే గెలిచారు.
తర్వాత రాష్ట్ర విభజన నేపధ్యంలో టిడిపిలోకి జంప్ చేసి అనంతపురం ఎంపిగా తాను, తాడిపత్రి ఎంఎల్ఏగా తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి గెలిచారు. నిజానికి అప్పటి వరకు అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎదురన్నదే లేకుండాపోయింది.
అలాంటి ఫ్యామిలి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. మొన్నటి ఎన్నికల్లో తండ్రులకు బదులుగా కొడుకులు పోటి చేసినా ఓడిపోయారు. ఇదే సమయంలో పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. అంటే ఇపుడు స్ట్రాంగ్ బేస్ ఉన్న తాడిపత్రిలో ఓడిపోవటం అటు పార్టీ ఓడిపోవటంతో పాటు బద్దశత్రువు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటాన్ని జేసి బ్రదర్స్ తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు జగన్ పై వీళ్ళు ఏ స్ధాయిలో నోరు పారేసుకున్నది అందరికీ తెలిసిందే.
దానికితోడు దశాబ్దాల పాటు ట్రావెల్స్ నడిపిన వీరిపై పలు ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో ట్రావెల్స్ బాధ్యుడైన ప్రభాకర్ రెడ్డి+ కొడుకు అస్మిత్ రెడ్డి మీద కేసులు పడ్డాయి. దాంతో వాళ్ళిద్దరు జైలుకు వెళ్ళక తప్పలేదు.
దాదాపు మూడు నెలలపాటు జైల్లో ఉండివచ్చిన తండ్రి, కొడుకులు బెయిల్ పై బయటకు రాగానే సిఐపై ఎదిరించినందుకే మళ్ళీ జైలుకెళ్ళారు. దాంతో తమపై ప్రభుత్వం కక్షకట్టిందనే ఆరోపణలు చేసి దివాకర్ రెడ్డి దాదాపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. అన్నింటికి మించి గడచిన ఆరుమాసాలుగా కరోనా వైరస్ ప్రభావం కూడా తీవ్రంగా ఉండటం దివాకర్ కు బాగా కలిసి వచ్చినట్లే ఉంది.
కరోనా పేరుతో గడచిన కొద్ది నెలలుగా ఫాం హౌస్ లోనే గడిపేస్తున్నారట. దాదాపు ఎవరినీ కలవటం కూడా లేదని సమాచారం. ఎంతో అవసరం అనుకున్న వాళ్ళను మాత్రమే ఫాం హౌస్ లోకి రానిస్తున్నారట. జేసి బ్రదర్స్ అంటేనే నోటి దురుసుకు పెట్టింది పేరు. నోరు కట్టేసుకుని ఎంత కాలం ఉండగలరో చూడాల్సిందే.
This post was last modified on September 23, 2020 10:53 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…