అది వైసీపీ ప్రభుత్వ కాలం. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. అది స్థలం జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి.
ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేశారు. ఆ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సెన్ రూ. 1.80 లక్షల లంచం ఇవ్వాలని కోరారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం ఇచ్చి పనిచేయించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. గత నెల 25, 26 తేదీల్లో కుప్పం పర్యటనకు వచ్చారు. ఈ సంధర్బంగా ఆయన బస చేసిన ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది.
దానిని కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చెవిన వేశారు. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషాతో శాఖాపరమైన విచారణ చేయించడంతో లంచం తీసుకున్న విషయం నిజమే అని తేలింది. దీంతో పాటు మరో రైతు నుండి భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ. లక్ష డిమాండ్ చేసినట్లు వారి దృష్టికి వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సద్దాంహుస్సేన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
This post was last modified on July 2, 2024 11:34 am
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…