బ్రిటన్‌లో రాజకీయ దుమారం రేగింది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రగులుకున్నాయి. ప్రధాన మంత్రి రుషి సునాక్‌ను ఉద్దేశించి.. ప్రతిపక్ష రిఫార్మ్ పార్టీ(ఆర్‌పీ) నాయకుడు ఒకరు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్‌లో సునాక్ హయాంలో తీసుకువచ్చిన.. మైగ్రేషన్ పాలసీ(వలస విధానం)పై స్పందిస్తూ.. ఇవి పాకీ నిర్ణయాలు. ఆయన ఓ పాకీ
అంటూ.. సదరు నేత విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి.
సహజంగా పాకీ
అనే పదాన్ని బ్రిటన్‌లో తీవ్రంగా భావిస్తారు. ఇవి జాత్యాహంకారానికి ప్రతీకలుగా భావిస్తున్నారు. ఇప్పుడు రిఫార్మ్ నాయకుడు చేసిన వ్యాఖ్యలను కూడా.. ప్రధాని సునాక్ అలానే భావిస్తున్నారు.
ఈ విషయంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘‘ఈ వ్యాఖ్యలు నా మనసును గాయ పరిచాయి“ అని అన్నారు. రిఫార్మ్ పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు కూడా.. హద్దులు మీరుతున్నారని సునాక్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రిఫార్మ్ పార్టీ సంస్కృతి, సంప్రదాయాలు లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోందని సునాక్ మండిపడ్డారు. ఇక, అధికార పార్టీ నేతలు కూడా.. సునాక్‌కు అండగా నిలిచారు. సదరు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక, రిఫార్మ్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ చీఫ్ నైజెల్ ఫరాజ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలను తమ పార్టీ ఎప్పటికీ ప్రోత్సహించని నైజెల్ తెలిపారు. ఇవి సదరు నేత.. వ్యక్తిగత వ్యాఖ్యలని.. పార్టీకి సంబంధం లేదని నైజెల్ పేర్కొన్నారు. గతంలోనూ తమ పార్టీలో కొందరు ఇలా వ్యాఖ్యానించినప్పుడు కఠిన చర్యలు తీసుకున్నామని.. ఇప్పుడు కూడా.. అదే పని చేస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ,.. అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల మంటలు రగులుతూనే ఉన్నాయి.
This post was last modified on June 30, 2024 10:06 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…