దేశంలో న్యాయ వ్యవస్థ మారుతోంది. జూలై 1(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నూతన నేర న్యాయ చట్టాల మేరకు.. తీర్పులు, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివి అందుబాటులోకి వస్తున్నాయి.
2023లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. మూడు నూతన నేర న్యాయ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి డెడ్ లైన్ జూన్ 30.. ఆదివారంతో ముగిసింది.
అనంతరం.. జూలై 1 నుంచి వీటిని అమలు చేసే ప్రక్రియ ప్రారంభవుతుంది. ఇప్పటికే అన్ని రాస్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటిన అమలు చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమి పార్టీలు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు ఇవ్వగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం ఇంకా వేచి చూస్తున్నాయి. కానీ, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేయాల్సిందేనని మోడీ సర్కారు తాఖీదులు ఇస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా.. అన్ని హైకోర్టులకు ఇప్పటికే ఈ నూతన చట్టాలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏమిటీ చట్టాలు…?
ఇప్పటి వరకు 1850-1902 మధ్య అప్పటి బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చిన ఐపీసీ(ఇండియన్ పీనల్ కోడ్), సీఆర్ పీసీ(క్రిమిలన్ ప్రొసీజరీ కోడ్) చట్టాలను అమలు చేస్తున్నారు. వీటి ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నారు. వీటి ప్రకారమే కోర్టులు కూడా.. చట్టాలకు లోబడి తీర్పులు ఇస్తున్నాయి. అయితే.. 2019లో రెండో సారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.. పాత చట్టాలను బుట్టదాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఐపీసీ, సీఆర్ పీసీలను పక్కన పెట్టారు.
వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక సురక్ష సంహితలను మోడీ సర్కారు 2023లో పార్లమెంటులో ఆమోదించింది. వీటిని జూలై 2024 నుంచి అమలు చేయాలని అప్పట్లోనే పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు వీటి ప్రకారమే కేసుల నమోదు.. తీర్పులు కూడా వెలువరించనున్నారు. వీటి వల్ల న్యాయం త్వరితగతిన ప్రజలకు చేరువ అవుతుందని ప్రధాని చెబుతున్నారు.
This post was last modified on June 30, 2024 6:26 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…