Political News

పదవి కోసం మంచి ఫ్రెండ్ కే హ్యాండిచ్చావ్.. అలీ

రాజకీయాల్ని వదిలేద్దాం. సినిమాల గురించే కాసేపు మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు.. హాస్య నటుడు అలీ మధ్యనున్న రిలేషన్ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్పే మాట ఒక్కటే.. వారిద్దరూ మంచి స్నేహితులని. ఆ మాటకు వస్తే.. పవన్ తో అలీ స్నేహం చేశారా? అలీతో పవన్ చేశారా? అన్న ప్రశ్నను పక్కన పెట్టేద్దాం.

పవన్ స్థాయికి అలీకి తాను చేసే ప్రతి సినిమాలోనూ ఒక పాత్రను క్రియేట్ చేసి మరీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. కానీ.. దాన్ని పట్టించుకోకుండా తాను నటించే ప్రతి సినిమాలోనూ అలీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం తన స్నేహితుడి విషయంలో పవనెంత శ్రద్ధ తీసుకుంటారన్న దానికి నిదర్శనం.

అంత మంచి స్నేహితుడిని పదవి కోసం వదులుకోవాల్సిన అవసరం ఉందా? పార్టీలో చేరినట్లే చేరి.. ఆ వెంటనే జంప్ అయి ఫ్యాన్ కింద సేద తీరటం వరకు ఓకే అనుకోవచ్చు. తనకు పదవిని కట్టబెట్టిన వారికి తన విధేయతను ప్రదర్శించే క్రమంలో అవాకులు.. చవాకులు పేలిన విషయాల్ని అలీ మర్చిపోవచ్చు కానీ తెలుగు ప్రజలు మర్చిపోరు కదా? సినిమాల్లో కావొచ్చు.. రాజకీయాల్లో కావొచ్చు బంధాలకు.. అనుబంధాలకు పెద్దగా విలువ ఉండదని. కేవలం అవసరం.. అవకాశాలే ఇద్దరి మధ్యనున్న బంధాన్ని డిసైడ్ చేస్తాయి.

కింది నుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ కష్టపడి పైకి వచ్చిన అలీ లాంటి నటుడు సైతం స్నేహ ధర్మాన్ని పక్కన పెట్టేసి.. తనకున్న ఆత్మీయ బంధాన్ని అధికార పక్షం ఇచ్చే పదవి కోసం తాకట్టు పెట్టేయటం ఒక ఎత్తు అయితే.. తాజాగా తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అలీ.. అక్కడితో ఆగినా ఆయనకు అంతో ఇంతో గౌరవం దక్కేది. అందుకు భిన్నంగా కవరింగ్ మాటలు చెప్పి.. ప్రజల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారు.

“వైసీపీనే కాదు ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు. ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. నా సినిమాలు నేను చేసుకుందామని అనుకుంటున్నా. ప్రతి ఐదేళ్లకోసారి నేనూ సామాన్యుడిలా ఓటు వేసి వస్తానంతే. రాజకీయాలకు స్వస్తి. గుడ్ బై’ అంటూ ప్రకటన విడుదల చేసిన పెద్ద మనిషి.. అదే లేఖలో మరిన్ని మాటలు మాట్లాడారు.

తాను రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. తాను చేస్తున్న దాన ధర్మాలకు.. సేవా కార్యక్రమాలకు రాజకీయం తోడైతే మరో పది మందికి ఉపయోగపడగలననే వచ్చానని.. తాను ఏ పార్టీలో ఉన్నా.. నాయుకుడిని.. పార్టీనీ.. ఆ పార్టీ అభ్యర్థులను పొగిడానే తప్ప.. ఇతర పార్టీల నాయకుల్ని విమర్శించలేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరం. మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు రాజకీయం తోడైతే మరింత మందికి సాయం చేయొచ్చన్న అలీ మాటలే నిజమని నమ్ముదాం. తనను పెంచి పెద్దవాడిని చేసిన సినిమా రంగానికే ఏమీ చేయలేని అలీ.. ఎందరికో సేవ చేశారన్న మాటల్నినమ్ముదామా?

ఇప్పటికి అలీ నిజాయితీగా ఉన్నారనే అనుకుందాం. అతడు చెప్పినట్లుగా వైసీపీ నేతగా.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన అలీ.. ఇన్నేళ్లలో ఎంతమందికి ఎన్ని సాయాలు చేశారు? అన్న ప్రశ్నకు సమాధానాలు చెప్పాల్సింది. తాను చెప్పిన మాటలకు జస్టిఫికేషన్ ఇచ్చే ఒక్క ప్రయత్నమైనాచేశారా? అంటే లేదనే చెప్పాలి. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారే తప్పించి ఇంకేం కాదు. మంచి చేయటం కోసం ఒక రాజకీయపార్టీలోకి వెళ్లానన్న అలీ మాటల్లో మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.

తాను ఏ పార్టీలో ఉన్నా నాయకుడిని.. పార్టీనీ.. ఆ పార్టీ అభ్యర్థుల్ని పొగిడానే తప్పించి.. ఇతర పార్టీల నాయకుల్ని విమర్శించలేదన్న మాటల్లో నిజం ఎంతన్నది గూగుల్.. యూట్యూబ్ వీడియోల్ని చూస్తే అర్థమవుతుంది.

నలుగురికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి స్నేహితుడు.. బంధాల విషయంలో నిజాయితీగా వ్యవహరించే వారికి దూరమై ఎంత సాధిస్తే ఏం లాభం?

This post was last modified on June 29, 2024 11:06 am

Share
Show comments
Published by
Satya
Tags: Ali

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago