Political News

వైసీపీకి అలీ రాజీనామా.. సెల్ఫీ వీడియోలో కీల‌క సంగ‌తులు!

తెలుగు క‌మెడియ‌న్ స్టార్‌.. అలీ.. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న వైసీపీతో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త రెండేళ్ల కింద‌ట ఆయ‌న‌కు అప్పటి సీఎం జ‌గ‌న్‌.. స‌ల‌హాదారు ప‌ద‌విని కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీటును కానీ, రాజ్య‌స‌భ సీటునుకానీ అలీ ఆశించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అవేవీ ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. ఇదిలావుంటే.. ఏపీలో వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అలీ తాజాగా సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. దీనిలో ఆయ‌న కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. తాను ఇక నుంచి రాజ‌కీయాల్లో ఉండ‌బోన‌న్నారు. ఏ పార్టీకీ మ‌ద్ద‌తుగా కానీ, మాట మాత్రంగా కానీ.. ప‌నిచేసేది లేద‌న్నారు.

ఇక‌, నుంచి కేవ‌లం సినీ న‌టుడిగా.. సాధార‌ణ పౌరుడిగా మాత్రమే జీవిస్తాన‌ని అలీ వెల్ల‌డించారు. గ‌తంలో తాను దివంగ‌త నిర్మాత రామానాయుడు ప్రోత్సాహంతో సినీరంగంలో కుదురుకున్న‌ట్టు తెలిపారు. ఆయ‌న వ‌ల్లే ఇంత వాడిని అయిన‌ట్టు చెప్పారు. ఇక‌, ఆయన రాజ‌కీయాల్లో ఉన్న స‌మ‌యంలో ప‌రుచూరు నుంచి పోటీ చేసిన‌ప్పుడు.. తాను ప్ర‌చారం చేశాన‌ని అలీ చెప్పారు. త‌ర్వాత‌.. కొన్నాళ్లు టీడీపీలోనే ఉన్న‌ట్టు చెప్పారు. త‌ర్వాత‌.. వైసీపీలోకి వ‌చ్చాన‌న్నారు. రాజ‌కీయాలు చేయ‌డానికి కాకుండా.. రాజ‌కీయంగా సేవ చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను వ‌చ్చిన‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

అయితే.. ఇప్పుడు మాత్రం తాను రాజ‌కీయాల‌కు పూర్తి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అలీ తెలిపారు. సినీ పరిశ్రమ తనకు చాలా మంచి జీవితం ఇచ్చిందని, ఇక నుంచి సినీ రంగంలోనే ఉంటాన‌ని చెప్పారు. “మా నాన్నగారిపేరుపై ఓ ట్రస్టును 16 ఏళ్లుగా నడుపుతున్నా. క‌రోనా స‌మ‌యంలో కూడా నేను సాయం ఆపలేదు. ఎంతో మందిని చదివిస్తున్నా. నా సంపాదనలో 20 శాతం సొమ్మును ట్రస్ట్ కు ఇస్తున్నా. వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనలేదు. వృత్తి పరంగా, రాజకీయాల్లో కూడా ఫలానా వ్యక్తిని లేదా రాజకీయ నాయకుడ్ని తప్పుడు మాట అనలేదు” అని అలీ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇకపై త‌న‌కు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధార‌ణ పౌరుడిగా.. సాధార‌ణ ఓట‌రుగా మాత్ర‌మే త‌న జీవితం ఇక‌నుంచి కొన‌సాగుతుంద‌న్నారు.

This post was last modified on June 28, 2024 8:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

5 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

6 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

7 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

8 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

8 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

8 hours ago