Political News

ఇలా అయితే.. అంద‌రూ పోతారేమో కేసీఆర్ గారూ!

ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి నాయ‌కుల జంపింగులు కొత్త‌కాదు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. అలానే దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉన్న రాజ‌కీయాలు రేపు ఉండ‌వు. రేపు ఉన్నవి మ‌రునాడు కూడా ఉండ‌వు. అయితే.. ఎవ‌రు పోయినా.. ఎవ‌రు వ‌చ్చినా.. కీల‌క‌నాయ‌కులు అనేవారిని నిల‌బెట్టుకోవాల్సి ఉంది. ఒక‌వేళ వెళ్లిపోతున్న నాయ‌కుల‌ను పిలిచి మాట్లాడాలి. ఓదార్చాలి. త‌ప్పులు ఎక్క‌డ జ‌రుగుతున్నాయి. వారు ఏం ఆశిస్తున్నారో చూడాలి . సాధ్య‌మైనంత వ‌ర‌కు వారిని పార్టీల‌కు అనుబంధంగానే ఉంచుకోవాలి.

కానీ, జ‌గ‌మెరిగిన బ్రాహ్మ‌ణుడికి జంధ్య‌మేల అన్న‌ట్టుగా రాజ‌కీయాల‌కు రాజ‌కీయాలు నేర్పించే స్థాయిలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు ఇవ‌న్నీ గుర్తు చేయాల్సిరావ‌డం వింత‌గా ఉంది. ఆయన అస‌హ‌నంతో అన్నారో.. ఏమైనా ఫ‌ర్వాలేద‌ని అనుకున్నారో.. నాయ‌కులు వెళ్లిపోయినా.. ఏం కాద‌ని సెల‌విచ్చారు. నిజమే.. ఇది ఒక‌ప్పుడు అనుకున్న ప‌రిస్థితివుంది. నాయ‌కులు పోయినా.. ప్ర‌జ‌లు మ‌న‌తో ఉన్నార‌ని.. బ‌లంగా విశ్వ‌సించి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లిన రోజులు ఉన్నాయి కాబ‌ట్టి వాటిని గ‌మ‌నంలో పెట్టుకుని కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించి ఉంటారు. కానీ, వాస్త‌వానికి ఇప్పుడు ప్ర‌జ‌లుకూడా కేసీఆర్‌తో లేరు.

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఒక‌రిద్ద‌రికి డిపాజిట్లు కూడా రాని ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను చేరుకునేందుకు వార‌ధుల వంటి నాయ‌కుల‌ను కూడా కోల్పోతే.. పార్టీకి పెను ప్ర‌మాదమ‌నే విష‌యాన్ని కేసీఆర్ ఎక్క‌డో మ‌రిచిపోతున్న‌ట్టుగా అనిపిస్తోంది. తాజాగా కేసీఆర్ ఎంతో విన‌యంగా ‘అన్న’ అని సంబోధిం చే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డి వెళ్లిపోయారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ జారుకున్నారు. దీనికి ముందు కేకే.. స‌హా అనేక మంది నాయ‌కులు జంప్ చేశారు.

అయినా.. ఇంత జ‌రుగుతున్నా.. కేసీఆర్ దూకుడుగానే ఉన్నారు. పోయేవాళ్లు పోవ‌చ్చ‌ని. వారి గురించి తాను ప‌ట్టించుకోన‌ని చెప్పారు. కానీ, చెబుతున్న ఈజీగా పార్టీ ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. వ‌య‌సు మీద‌ప‌డుతుండ‌డంతో మునుప‌టి మాదిరిగా తెలంగాణ స‌మాజంలో కేసీఆర్ ప్ర‌జ్వ‌ల వేడిని ర‌గించ‌లేర‌నేది వాస్త‌వం. ఇదేస‌మ‌యంలో నాయ‌క‌త్వ లోపంతోనూ పార్టీ ఇబ్బందులు ప్రారంభ‌మ‌య్యాయి. ఇలాంటి స‌మ‌యంలో నాయ‌కుల‌ను కాపాడుకుని.. ఆరుతున్న దీపానికి చేతులు అడ్డుపెట్టుకోవాల్సిన స‌మ‌యంలో చేతులు ఎత్తేసి.. ఏమైనా ఫ‌ర్వాలేదంటే.. పుంజుకునేందుకు బీజేపీ, పొద‌వి ప‌ట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి.

This post was last modified on June 25, 2024 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు రాక‌తో మ‌ళ్లీ లులూ జోష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో మ‌ళ్లీ పెట్టుబ‌డుల‌కు జోష్ పెరిగింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు మాసాల్లోనే ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు…

8 hours ago

తీగ దొరికింది డొంక ప్యాలెస్‌లో వుంది: ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం…

9 hours ago

దసరా పండక్కు టాలీవుడ్ సూపర్ 6

మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో…

9 hours ago

శంకర్ & తమన్ ‘గేమ్ ప్రెజర్’

గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు…

11 hours ago

‘పుష్ప’ మ్యాజిక్‌ను ‘దేవర’ రిపీట్ చేస్తుందా?

నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన…

12 hours ago

జగన్ ‘మానవత్వం’పై ఎన్ని కౌంటర్లో..

"నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం" అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ…

12 hours ago