Political News

వైసీపీ కార్యాల‌యం కూల్చివేత‌.. జ‌గ‌న్ గ‌గ్గోలు!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శివారు ప్రాంతమైన తాడేప‌ల్లిలో సుమారు 15 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన(తుది ద‌శ‌కు చేరుకుంది) వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని తాజాగా అధికారులు కూల్చేశారు. అక్ర‌మ నిర్మాణ‌మ‌ని.. అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని పేర్కొంటూ.. శ‌నివారం తెల్ల‌వారు జామున ఈ నిర్మాణాన్ని నేల మ‌ట్టం చేశారు. పైగా వైసీపీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే.. ఈఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మ క సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అని జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

భిన్న స్పంద‌న‌!

ప్ర‌స్తుతం జ‌రిగిన కూల్చివేతల ప‌ర్వంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌జావేదిక‌ను కూల్చేశారు కాబ‌ట్టి.. ఇప్పుడు తాము కూడా.. కూల్చివేత‌ల‌తోనే ప‌ని ప్రారంభిస్తాం.. అన్న‌ట్టుగా టీడీపీ ప‌ని చేస్తోందా? అని కొంద‌రుప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు మాత్రం.. అక్ర‌మంగా నిర్మించుకున్న దానిని కూల్చేస్తే త‌ప్పేముంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు నోటీసులు ఇచ్చి.. స‌మ‌యం కేటాయించి.. ప్ర‌జ‌ల్లోకి ఈ అక్ర‌మాన్ని తీసుకువెళ్లి.. అప్పుడు కూల్చి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు. ఎవ‌రికి అనుకూలంగా వారు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 22, 2024 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

22 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

2 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago