ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని గద్దెదించేసిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదు.దీంతో వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా.. పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయారు. అయితే.. తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అధికారం కోల్పోయినా.. 33 మంది ఎమ్మెల్యేలను దక్కించుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే నిలబెట్టుకుంది.
కానీ… ఇప్పుడు ఈ హోదాపైనే కాంగ్రెస్ కన్నేసింది. తాము తీసుకుంటున్న అనేక నిర్ణయాలను అసెంబ్లీ లో బీఆర్ఎస్ అడ్డుకుంటున్న దరిమిలా.. ముఖ్యమైన నిర్ణయాలు పెండింగ్‌లో పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా.. బీఆర్ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార పార్టీవైపు నడిపించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే.. కొందరు నాయకులు వచ్చారు.
ఇక, ఇప్పుడు.. బీఆర్ఎస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో కూసాలు కదిలిపోయిన దరిమిలా.. సిట్టింగ్ ఎమ్మెల్యే లు.. ఆ పార్టీలో ఉంటే నియోజకవర్గం నిదులు కూడా తమకు అందే పరిస్థితి లేదని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పిలుపునకు వారు అంతర్గత సమావేశాల్లో ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది. ఇదేసమయంలో మరో నలుగురు ఎమ్మెల్యేలపైనా కన్నేసింది. అయితే.. వీరితో బీఆర్ఎస్ అధినేత చర్చించారు. పార్టీ మారొద్దని సూచించారు.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ అధినేత చెప్పినట్టుగా లేదు. కాంగ్రెస్ వైపు నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని పలువురు నాయకులు తమకు సన్నిహితంగా ఉన్న వారి వద్ద చెబుతున్నారు. త్వరలో నే స్థానిక ఎన్నికలు ఉన్న దరిమిలా.. అధికార పార్టీ నుంచి తమపై ఒత్తిడి ఉందని.. పైగా బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని వారు గుర్తు చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు సుమారు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు చిక్కుతారని అంటున్నారు. విడతల వారీగా వారిని కారు దింపేస్తే.. తమ పని సులువు అవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తుండడం గమనార్హం. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి.. ఎప్పుడేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 21, 2024 2:08 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…