ఏపీలో ఎన్నికలకు ముందు తీవ్ర రాజకీయ వివాదంగా మారిన.. వలంటీర్ల వ్యవహారం.. ఇప్పుడు మరింత రాజుకుంది. ఎన్నికలకు ముందు.. వలంటీర్లను విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
వారంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారని.. దీంతో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ.. వలంటీర్ల పై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారిని విధుల నుంచి తప్పించారు. అయితే.. ఇది రాజకీయంగా దుమారం రేపింది.
ఇదిలావుంటే.. అప్పట్లో వలంటీర్ వ్యవస్థను రద్దు చేయలేదు. అయితే.. విధులకు.. పార్టీల కార్యక్రమాలకు.. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ, వైసీపీ నాయకుల ఒత్తిడితో చాలా మంది వలంటీర్లు ఆయా పదవులకు రాజీనామా చేశారు.
మళ్లీ వైసీపీనే వస్తుందని.. అప్పుడు మిమ్మల్ని చేర్చుకోవాలంటే.. ఇప్పుడు రాజీనామా చేయాలంటూ.. నాయకులు ఒత్తిడి పెంచారు. ఇక, వైసీపీ అధికారంలోకి రాలేదు.
దీంతో ఇప్పుడు రాజీనామా చేసిన వలంటీర్లు.. తల్లడిల్లుతున్నారు. అప్పట్లో రాజీనామా చేసిన తాము.. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గామని..తమను విధుల్లోకి తీసుకోవాలని.. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు వంటివారిని కలిసి విన్నవిస్తున్నారు.
అయితే.. వీరు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. అప్పట్లో మేం రాజీనామాలు చేయొద్దని చెప్పాం.. మీరు వినలేదు.. కాబట్టి.. ఇప్పు డు పరిస్థితి మా చేతుల్లో లేదని నిమ్మల వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి అచ్చెన్న అయితే.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లారు. అప్పట్లో మీతో రాజీనామాలు చేయించిన వారిపై ముందు పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టి రావాలని ఆయన ఆదేశించారు. ఇలా చేసిన వారిని మాత్రమే తిరిగివలంటీర్లుగా తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
ఇలా.. వలంటీర్ల వ్యవహా రంలో మంత్రులు తలకోమాట చెప్పడంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చివరకు ఈవిషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా.. ఎన్నికలకు ముందు తర్వాత కూడా.. వలంటీర్ల చుట్టూ రాజకీయాలు ముసురుకోవడం గమనార్హం.
This post was last modified on June 19, 2024 12:21 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…