టీడీపీకి అంతా హ్యాపీనే! జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవసరముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మరింత పెంచుతూ ఆ పార్టీ నాయకుల్లో ఒకరిని గవర్నర్‌గా చేసే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
టీడీపీ సూచించిన నాయకుడికి గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నాయకులు అశోక్‌గజపతి రాజు, యనమల రామకృష్ణుడిలో ఒకరిని గవర్నర్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతల వారసురాళ్లు ఈ సారి ఎన్నికల్లో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
యనమల కుమార్తె దివ్య, అశోక్‌గజపతి తనయ అదితి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వీళ్లలో ఏ ఒక్కరికి కూడా బాబు మంత్రి పదవి ఇవ్వలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా పని చేశారు. మరోవైపు అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ పదవిని ఇచ్చేలా బాబు ఆలోచిస్తున్నట్లు టాక్. బీజేపీ ఆఫర్‌ను వాడుకుని ఈ ఇద్దరిలో ఒకరిని గవర్నర్ చేయాలని బాబు అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
This post was last modified on June 14, 2024 6:01 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…